10 ‍మల్టీ బేగర్స్‌.. ఏకంగా 6700 శాతం రిటర్న్స్‌

28 Sep, 2022 15:00 IST|Sakshi

దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడులుపెట్టి లాభాలనుఆర్జించడం అంటే  ఆషామాషీ వ్యవహారం కాదు.  కంపెనీ వ్యూహాలు,  వృద్ది, భవిష్యత్తు ప్రణాళికలు, ఫండ మెండల్స్‌, తాజా మార్కెట్‌ ట్రెండ్‌  లాంటి విషయాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. అలా అన్ని  మెళకువలను ఒంట పట్టించుకొని కోట్లు గడించాడు 29 ఏళ్ల మద్రాస్‌ ఐఐటీ పోస్ట్ గ్రాడ్యుయేట్.

తాజాగా ముంబైకి చెందిన నిఖిల్ గంగిల్ (29) ఐఐటీ మద్రాస్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌  పోస్ట్ గ్రాడ్యుయేట్. గత ఐదేళ్లలో కనీసం 10 మల్టీ బ్యాగర్‌లను గుర్తించి  భారీ లాభాలను గడించాడు.  తనదైన పరిశీలన, నైపుణ్యంతో ఆకర్షణీయమైన లాభాలను  తన ఖాతాలో వేసుకున్నాడు.

బిజినెస్ టుడేతో జరిగిన ఇంటరాక్షన్‌లో యువ పెట్టుబడిదారుడు తన సక్సెస్‌జర్నీని పంచు కున్నాడు. స్టాక్ పికింగ్ అనేది ఒక చక్కటి కళ, అయితే సహనం పోర్ట్‌ఫోలియోను  ఎంచుకుంటే ఫ్యూచర్‌ అద్భుతంగా మారిపోతుంది అంటాడు. సవాకా బిజినెస్ మెషీన్స్ వంటి స్టాక్‌లు తనకు 68 రెట్లు లేదా 6,700 శాతం రాబడిని అందించాయని చెప్పారు.  అలాగే మేఘమణి ఫినెకెమ్ (15 రెట్లు), టాటా పవర్ (6.5 రెట్లు), టాటా మోటార్స్ (6.5 రెట్లు), GNA యాక్సిస్ (5.8 రెట్లు), రామ్‌కో సిస్టమ్ (5 సార్లు), నవ (4.7 రెట్లు), మారథాన్ నెక్స్ట్‌జెన్ రియాల్టీ (4.7 రెట్లు), తేజస్ నెట్‌వర్క్స్ (4.5 రెట్లు) ఫీమ్ ఇండస్ట్రీస్ 4 రెట్ల లాభాలను తెచ్చిపెట్టాయి.  కొన్నేళ్ల  ప్రయత్నాలు, వైఫల్యాల  తరువాతపెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేసుకుని  భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటికీ ఈ షేర్లలో కొన్నింటిని హోల్డ్‌ చేస్తున్నాడు.  

పెట్టుబడి వ్యూహంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, సినిమాలు చూడటం, ప్రయాణాలు, పాడటం కూడా ఇష్టపడే తాను  తక్కువపెట్టుబడితో అద్భుతమైన  లాభాలనిచ్చి బిజినెస్‌ను ఇష్టపడతాడట. ప్రతి బిజినెస్‌కు అప్  అండ్‌ డౌన్‌ ఉంటుంది.  కానీ సరియైన ధరకోసం  వేచి ఉంటానని చెప్పాడు. మూలధనంపై రాబడి (రిటన్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయీడ్‌)  అనే సొంత ర్యాంకింగ్‌ సంస్థను ఏర్పాటు చేశాడు.  తాను ఎంపిక చేసిన స్టాక్స్‌ టాప్‌ 3లో ఉన్నాయంటూ సంతోషాన్ని ప్రకటించాడు.  ఐఐటీ మద్రాస్‌లో ఎం-టెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన  నిఖిల్‌  పుస్తకాలు చదవడం బాగా ఇష్టపడే గాంగిల్ ఇటీవల వారెన్ బఫెట్ లాగా పెట్టుబడికి 7 రహస్యాలు పుస్తకం చదివానని చెప్పాడు. ఇంకా  ది లిటిల్ బుక్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ (క్రిస్టోఫర్ హెచ్ బ్రౌన్) మాస్టరింగ్ ది మార్కెట్ సైకిల్  (హోవార్డ్ మార్క్స్)  ది లిటిల్ బుక్ దట్ బీట్స్ ది మార్కెట్- (జోయెల్ గ్రీన్‌బ్లాట్) బుక్స్‌కూడా తనకు ఉపయోగపడ్డాయని చెప్పాడు 

గాంగిలి విజయ రహస్యాలు, ఇన్వెస్టర్లకు సందేశాలు
మొదటి రోజు నుండీ  వాల్యూ ఇన్వెస్టర్‌గా ఉండాలి.
మొదటి నుంచి దూర దృష్టి ఉండాలి.
లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లక్క్ష్యంతో పెట్టుబడులుపెట్టాలి.
కనీసం 5-8 సంవత్సరాలు ఎదురుచూస్తే ఓపిక ఉండాలి.
వాల్యూ ఇన్వెస్టర్‌గా వృద్ధిని తక్కువ అంచనా వేయకూడదు
గ్రోత్‌ ఇన్వెస్టర్‌గా వాల్యూని తక్కువ అంచనా వేయకూడదు.
వీలైనన్ని  బిజినెస్‌  పుస్తకాలు,  విశ్లేషణలు చదవాలి
ప్రతీ షేరును విశ్లేషించి.. కరెక్ట్‌ ధర కోసం వేచి చూడాలి
వాల్యుయేషన్ , సైకిల్ ఆధారంగా ఒక స్టాక్‌ను అండర్‌వాల్యూడ్ , ఓవర్‌వాల్యూడ్  అనేది నిర్వచించుకుంటా.
దాన్నే  నేను కనిష్ట అంతర్గత విలువ , గరిష్ట అంతర్గత విలువ.
స్టాక్ ‘మిన్ ఇంట్రిన్సిక్ వాల్యూ’కి వచ్చినప్పుడు కొంటాను , అది ‘మాక్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ’ని  టచ్‌ చేసినపుడు అమ్మేస్తా

మరిన్ని వార్తలు