మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోండి ఇలా..?

18 Jan, 2022 17:12 IST|Sakshi

రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్‌ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్‌లో అందిస్తుంది. 

గూగుల్ మ్యాప్స్‌లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..?

  • మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్‌ యాప్ ని అప్డేట్ చేసుకోండి.
  • ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్‌లో క్లిక్ చేయండి. 
  • మ్యాప్స్‌లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. 
  • ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. 

(చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్‌!! ఏం చేశారంటే..) 

మరిన్ని వార్తలు