Jeff Bezos Said About Netflix: నెట్‌ఫ్లిక్స్‌పై ప్రశంసలను కురిపించిన అమెజాన్‌ అధినేత..! యూజర్లు షాక్‌..!

4 Oct, 2021 21:35 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన స్క్విడ్‌ గేమ్‌ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణను పొందుతుంది. స్క్విడ్‌ గేమ్‌ ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందంటే వీక్షకుల రద్దీ కారణంగా పెరిగిన దక్షిణకొరియాకు చెందిన ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ ఎస్‌కే బ్యాండ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ట్రాఫికింగ్‌, నిర్వహణ ఖర్చులను చెల్లించాలని నెట్‌ఫ్లిక్స్‌ దావాలను వేసింది. 

వెబ్‌సిరీస్‌ సూపర్‌ అంతే..!
జెఫ్‌బెజోస్‌ తన ప్రత్యర్థి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌పై  ప్రశంసల జల్లులను కురిపించాడు. అంతర్జాతీయంగా  నెట్‌ఫ్లిక్స్‌ పాటిస్తున్న వ్యూహాలను ట్విటర్‌ వేదికగా పొగడ్తలను కురిపించాడు. జెఫ్‌బెజోస్‌ తన ట్విట్‌లో..అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్‌ పాటిస్తున్న వ్యూహాలు అంతా సులభమైనవి కావు. నెట్‌ఫ్లిక్స్‌ కో సీఈవో రీడ్ హెస్టింగ్స్‌ చేస్తున్న కృషిని ఎంతగానో మెచ్చుకున్నారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ కూడా స్క్విడ్‌ గేమ్‌ వెంటనే చూస్తానని ట్విటర్‌లో పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ పాలసీ స్పూర్తిదాయకంగా ఉందని కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ట్విటర్‌లో తన ప్రత్యర్థి ఓటీటీని మెచ్చుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.  

అందులో నెట్‌ఫ్లిక్స్‌  తోపు...!
ఇతర దేశాలకు చెందిన వెబ్‌సిరీస్‌లను, సినిమాలను రూపొందించడంలో నెట్‌ఫ్లిక్స్‌ సాటి ఎవరు లేరు. స్పానిష్‌, కొరియన్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌ల్లో సూపర్‌హిట్‌ వెబ్‌సిరీస్‌లను అందించింది. అందులో నార్కోస్‌, డార్క్‌, లా కాసా డెపాపాల్‌(మనీ హైస్ట్‌), స్క్విడ్‌ గేమ్స్‌ అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందాయి. 


చదవండి: Netflix: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!

మరిన్ని వార్తలు