28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!

28 Sep, 2022 15:20 IST|Sakshi

సాక్షి,ముంబై: సాధారణంగా ఏ మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్‌ చేసుకోవాలన్నా 28రోజుల వాలిడిటీ ఉంటుంది గమనించారా?  నెలలో 30, 31 రోజులుంటే టెలికాం కంపెనీలు లెక్క  మాత్రం 28 రోజులే. అలాగే 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు? ఉంటాయి. దీనికి వెనుక బిజినెస్‌ ప్లాన్‌గురించి ఒకసారి ఆలోచిస్తే.. కస్టమర్లు సంవత్సరానికి  12 నెలలకు  12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసు కోవాలనేది ఎపుడైనా గుర్తించారా? అదే కంపెనీ దోపిడీ మంత్ర.

ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఇలా ఆయా కంపెనీల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లో అనేక రకాల ప్లాన్‌లను అందిస్తాయి. ఈ రకమైన ప్లాన్ కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల ప్లాన్ కారణంగా 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి. (పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్)

ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరికొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని కంపెనీలు దండుకుంటున్నాయి. అయితే  ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది.  (డ్రోన్‌ కెమెరా ఆర్డర్‌ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్‌ షాక్‌!)

ట్రాయ్‌ కీలక ఆదేశాలు
వినియోగదారుల ఫిర్యాదుమేరకు 28 రోజుల ప్రణాళికను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) తప్పుబట్టింది.  28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ మార్గదర్శకం జారీ చేసింది.దీని ప్రకారం నెల చెల్లుబాటయ్యేలా  జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాకూడా  మొత్తంగా కాకగాపోయినా  కొన్ని ప్లాన్లను లాచ్‌ చేసింది. 
 

మరిన్ని వార్తలు