భారీగా పెరిగిన  హీరో మోటోకార్ప్‌ బైక్‌ ధరలు...! కొత్త ధరలు ఇవే...!

28 Sep, 2021 19:26 IST|Sakshi

భారత టూవీలర్‌ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ప్లెండర్‌ బైక్‌ ధరలను పెంచుతూ హీరో మోటోకార్ప్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 20 నుంచి అ‍మలుల్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన  స్ప్లెండర్ బైక్‌ ధరలను హీరో మోటోకార్ప్‌ సవరించింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని బైక్ల ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్‌  ప్రకటించింది. స్ప్లెండర్‌ బైక్‌ ధరలు సుమారు వెయ్యి నుంచి రెండు వేల వరకు హీరో మోటోకార్ప్‌ పెంచింది. అంతేకాకుండా మాస్ట్రో ఎడ్జ్‌, డెస్టినీ 125 , ప్లెజర్‌ ప్లస్‌ స్కూటీ ధరలు కూడా పెరిగాయి.
చదవండి: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!

హీరో మోటోకార్ప్‌ బైక్ల కొత్త ధరలు
క్రమసంఖ్య  మోడల్‌ కొత్త ధర(రూ.) పాత ధర(రూ.)  
1. స్ప్లెండర్ ఐస్మార్ట్ డ్రమ్/అల్లాయ్ 69,650 68,650
2. స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్/డ్రమ్/అల్లాయ్ 67,160 66,050
3. స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్/డ్రమ్/అల్లాయ్/i3S  68,360 67,210 
4. స్ప్లెండర్ ప్లస్ బ్లాక్‌ అండ్‌ అసెంట్‌ సెల్ఫ్‌ / డ్రమ్ / అల్లాయ్‌ 68,860  67,260
5. సూపర్ స్ప్లెండర్ డ్రమ్/అల్లాయ్ 73,900 72,600
6. సూపర్ స్ప్లెండర్ డిస్క్/అల్లాయ్ 77,600 75,900
7. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డ్రమ్ 73,450 72,250
8. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డిస్క్ 77,900 76,500
9. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డిస్క్ ప్రిస్మాటిక్ కనెక్ట్‌ 81,900 79,750
10. డెస్టినీ 125 స్టీల్ డ్రమ్ 70,400 69,500
11. డెస్టినీ 125 100 మిలియన్ ఎడిషన్ 75,500  74,750
12. డెస్టినీ 125 అల్లాయ్ డ్రమ్ VX ప్లాటినం 75,900 74,700
13. మాస్ట్రో ఎడ్జ్ 110 అల్లాయ్ డ్రమ్ VX 65,900 64,250
14. ప్లెజర్ ప్లస్ స్టీల్ డ్రమ్ LX 61,900 60,500
15. ప్లెజర్ ప్లస్ అల్లాయ్ డ్రమ్ VX 64,200 62,850
16. ప్లెజర్ ప్లస్ ప్లాటినం అల్లాయ్ డ్రమ్ ZX 66,400 64,950

చదవండి: Stangest Thing I Have Ever Worked On: నా కెరియర్‌లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు