ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు శుభవార్త!

6 Jan, 2022 19:48 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు హీరో ఎల‌క్ట్రిక్ శుభ‌వార్త చెప్పింది. భారీ ఎత్తున ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ స‌ర్వీసింగ్ సెంటర్ల‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు చెప్పింది. ఇందుకోసం హీరో ఎలక్ట్రిక్‌ తాజాగా ఆటోమోటివ్‌ మల్టీ సైడెడ్‌ ప్లాట్‌ఫామ్‌.. స్పేరిట్‌తో చేతులు కలిపింది. 

తద్వారా ప్రయివేట్‌ గ్యారేజ్‌ యజమానులకు ఎలక్ట్రిక్‌ వాహన సర్వీసింగులో శిక్షణ ఇవ్వడంతోపాటు.. ఆయా సంస్థల నెట్‌వర్క్‌ను వినియోగించుకోనుంది. 

వెరసి తమ ఎలక్ట్రిక్‌ వాహనాలకు మరిన్ని సర్వీసింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ పేర్కొంది. స్పేరిట్‌తో ఒప్పందం కారణంగా ప్రయివేట్‌ గ్యారేజ్‌ యజమానులతోపాటు.. కంపెనీకి చెందిన బీటూబీ, బీటూసీ క్లయింట్లకు సైతం ఎలక్ట్రిక్‌ వాహన సర్వీసులను అందించనున్నట్లు తెలిపింది. 

చ‌ద‌వండి: రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు

మరిన్ని వార్తలు