హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ మోటార్స్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం నైడెక్ కార్పొరేషన్‌తో హీరో ఎలక్ట్రిక్ ప్రాధాన్య భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హీరో తయారీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో నైడెక్ రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్స్‌ను వినియోగిస్తారు.
2023 ఫిబ్రవరిలో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు కావాల్సిన మోటార్స్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు నైడెక్‌తో రెండేళ్ల క్రితమే చేతులు కలిపినట్టు హీరో ఎలక్ట్రిక్ వెల్లడించింది. తమ సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడంలో జపాన్ నైడెక్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుందని, ఉత్పత్తుల శ్రేణిలో పవర్‌ట్రెయిన్ భాగాలను క్రమంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్సీఈవో సోహిందర్గిల్ అన్నారు. అలాగే భారతీయ పరిస్థితులకు తగినఆధునిక అధునాతన సాంకేతికతతో కూడిన హబ్ మోటార్ అభివృద్ధికి హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం ఉపయోగపడనుందని నైడెక్ ప్రతినిధి సంతోషం వ్యక్తం చేశారు.