హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్

25 Aug, 2021 15:08 IST|Sakshi

ప్రముఖ ఈవీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ తన ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పించింది. కంపెనీలో కనీసం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగీకి కొన్ని ప్రయోజనాలను కలిపించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమాన స్థాయిలో ప్రయోజనాలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది.(చదవండి: e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్‌)

  • రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కంపెనీలో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ఉపాధిని కల్పించడం. 
  • ఉద్యోగులకు వాహన రుణాలను అందించడం, అలాగే అదనపు సెలవులు ఇవ్వడం.
  • దీర్ఘకాలిక గృహ రుణాలను స్థిర వడ్డీకి హీరో కేర్ అందిస్తుంది. 
  • ఉద్యోగులకు ప్రసూతి సెలవుల కింద 15 రోజులు సెలవులు ఇవ్వడం, 6 నెలల వరకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం, మొదటి 3 నెలల్లో 10 రోజుల వరకు ఇంట్లో నుంచి పనిచేయవచ్చు.
  • 20-25 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులు పనితీరు ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలు, స్కాలర్ షిప్స్ ఇవ్వనుంది. 
  • పరీక్షల సమయంలో వారికి ఫ్లెక్సీబుల్ టైమింగ్స్ కల్పించనుంది. 

హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు కొన్ని ప్రయోజనాలు కల్పించడమే కాకుండా వారి కుటుంబాన్ని వారి కెరీర్ లో ముందే ఉండే విధంగా సంస్థ సహాయం అందిస్తుంది. మా ఉద్యోగులు గత రెండు సంవత్సరాలుగా కష్టపడి పనిచేయడం వల్ల ఈ రోజు మేము ఈ స్థాయికి చేరుకున్నాము అని" అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు మాజీ హీరో క్లబ్ లోచేరి తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది అని అన్నారు. క్లబ్ లో జాయిన్ అయిన వారికి ఐదు సంవత్సరాల వరకు ఉచిత వార్షిక ఆరోగ్య చెకప్స్ చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు