10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్‌ కార్గోతో హీరో ఎలక్ట్రిక్‌ జోడీ 

23 Apr, 2022 21:01 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డెలివరీ సేవల్లో ఉన్న ఈవెన్‌ కార్గోతో హీరో ఎలక్ట్రిక్‌ చేతులు కలిపింది. ఇందులో భాగంగా 2025 నాటికి 10,000 మందికిపైగా మహిళలను ఈవెన్‌ కార్గో వేదికపైకి తీసుకు వచ్చేందుకు హీరో ఎలక్ట్రిక్‌ సాయం చేస్తుంది.

హైదరాబాద్, ముంబై, ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను సమకూరుస్తారు. ఈవెన్‌ కార్గో డెలివరీ ప్రతినిధులుగా పూర్తిగా మహిళలే ఉండడం విశేషం. పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. 

చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్థిక శాఖ కీలక నిర్ధేశం..!

మరిన్ని వార్తలు