పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహన అమ్మకాలు నిలిపివేయాలి

22 Sep, 2021 18:17 IST|Sakshi

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజల్ 2027 నాటికి ఇంధనాలతో నడిచే ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొనే వారి సంఖ్య చైనా వంటి దేశాల కంటే చాలా తక్కువ అని అన్నారు. అధిక ధరలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఈవీ రంగం దెబ్బతింటుంది అని పేర్కొన్నారు. ప్రపంచ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో చైనా 97 శాతం వాటా కలిగి ఉండగా, అదే భారతదేశం అమ్మకాల్లో 1 శాతం కంటే తక్కువ అని అన్నారు. 

ఇంధనాలతో నడిచే ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధిస్తే ఇతర దిగ్గజ కంపెనీలు వేగంగా ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అని ఆయన అన్నారు. ఒకసారి ప్రధాన కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వైపు అడుగు వేస్తే అన్నీ మౌలిక సదుపాయాల కొరత వంటి ఇతర సమస్యలు అన్నీ తగ్గే అవకాశం ఉంది అని అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ వేహికల్ మేకర్ తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు విస్తరించడానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆలోచిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ఈవీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతదేశం అంతటా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఎగుమతుల ద్వారా ఐరోపా, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో తన ఉనికిని చాటాలని యోచిస్తోంది.(చదవండి: Fact Check: డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌ ఇలా ఉన్నాడేంటీ?)

మరిన్ని వార్తలు