Hero Glamour 125 : కాలింగ్‌ ఫ్రం హోం.. గ్లామర్‌లో బ్లూటూత్‌ ఫీచర్‌

1 Aug, 2021 11:23 IST|Sakshi

ముంబై: లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోహోండా గ్లామర్‌ 125 సీసీ బైక్‌లో మరొ అధునాత ఫీచర్‌ని హీరో మోటర్‌ కార్ప్‌ జోడించింది. మార్కెట్‌లో గ్లామర్‌కి పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు సవాల్‌ విసిరింది. 

బ్లూటూత్‌
ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న 125 సీసీ సెగ్మెంట్‌లో హీరో గ్లామర్‌ది ప్రత్యేక స్థానం. మైలేజీ, మెయింటనెన్స్‌, స్టైలింగ్‌ విషయంలో బ్యాలెన్స్‌ చేస్తూ మార్కెట్‌లోకి వచ్చిన తక్కువ కాలంలోనో ఎక్కువ అమ్మకాలు సాధించింది. డిజిటల్‌ డిస్‌ప్లేతో ఆదిలోనే ఆకట్టుకుంది. కాగా తాజాగా గ్లామర్‌ బైక్‌కి బ్లూటూత్‌ ఫీచర్‌ని యాడ్‌ చేసింది హీరో మోటర్‌ కార్ప్‌.

టీజర్‌ రిలీజ్‌
రైడింగ్‌లో ఉన్నప్పుడు మోబైల్‌కి వచ్చే కాల్స్‌ వివరాలు చూసుకునేందుకు వీలుగా బ్లూటూత్‌ ఫీచర్‌ని హీరో మోటర్‌ కార్ప్‌ జత చేసింది. దీనికి తగ్గట్టుగా మీటర్‌ కన్సోల్‌లో డిజిటల్‌ డిస్‌ప్లే సైజుని కూడా పెంచింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా టీజర్‌ను హీరో మోటర్‌ కార్ప్‌ లాంఛ్‌ చేసింది.

మరిన్ని హంగులు
బ్లూ టూత్‌ ఫీచర్‌తో పాటు గ్లామర్‌ 125 సీసీలో ఎల్‌ఈడీ ల్యాంప్‌ను మరింత ఆకర్షణీయంగా  హీరో మోటర్‌ కార్ప్‌ మార్చింది. హెచ్‌ ఆకారంలోకి హెడ్‌ల్యాంప్‌ని డిజైన్‌ చేసింది. అదే విధంగా ‍స్పీడో మీటర్‌ కన్సోల్‌ని ప్తూర్తిగా డిజిటల్‌గా మార్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో హీరోహోండా గ్లామర్‌ 125 సీసీ ధర రూ.78,900 (ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. అప్‌గ్రేడ్‌ చేసిన గ్లామర్‌ 125 సీసీని ఈ ఆగస్టులోనే మార్కెట్‌లో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు