హీరో మోటోకార్ప్‌... 

21 Jul, 2021 01:34 IST|Sakshi

‘గ్లామర్‌ ఎక్స్‌టెక్‌’ బైక్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ చార్జర్, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్, సైడ్‌ స్టాండ్‌ ఇంజన్‌ కట్‌ ఆఫ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ వంటి హంగులు పొందుపరిచారు. 125 సీసీ బీఎస్‌–6 ఇంజన్‌తో తయారైంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్‌ బ్రేక్స్‌ వేరియంట్‌ రూ.78,900, డిస్క్‌ బ్రేక్స్‌తో రూ.83,500 ఉంది. సాంకేతికత, శైలి, భద్రత కోరుకునే వినియోగదార్ల కోసం దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 2005లో హీరో గ్లామర్‌ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో దేశీయంగా కంపెనీ 10,24,507 యూనిట్ల మోటార్‌ సైకిల్స్, స్కూటర్స్‌ను విక్రయించింది.

>
మరిన్ని వార్తలు