కేంద్రంపై ‘హీరో’ పంకజ్‌ ముంజాల్‌ ఘాటు విమర్శలు

5 Oct, 2021 08:43 IST|Sakshi

ఈ–బైసికిల్‌ వ్యాపారానికి ముప్పు: ముంజాల్‌

ముంబై: దేశంలో ఎలక్ట్రిక్‌ బైసికిల్‌ వ్యాపారానికి ముప్పు ఉందని హెచ్‌ఎంసీ గ్రూప్‌ సీఎండీ పంకజ్‌ ఎం ముంజాల్‌ అన్నారు. తయారీ, ఎగుమతులను ప్రోత్సహించే ముఖ్యమైన పాలసీల నుంచి ఈ విభాగాన్ని విస్మరించడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ‘దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్‌–2తోపాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాల పథకంలో ఈ–బైసికిల్స్‌ చేర్చలేదు. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో యూరోపియన్‌ యూనియన్‌కు రూ.10,000 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలను భారత్‌ కోల్పోయే ప్రమాదం ఉంది.

చైనా నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు 83 శాతం వరకు యాంటీ డంపింగ్‌ డ్యూటీని ఈయూ విధిస్తోంది. ఈ–బైక్స్‌ మార్కెట్‌ ఈయూలో రూ.43,000 కోట్లుంది. భారత్‌తో పోలిస్తే విలువ పరంగా 50 రెట్లు పెద్దది. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా భారత్‌ అవకాశంగా మలుచుకోవాలి. సైకిళ్లపై దిగుమతి సుంకాలను ప్రస్తుతం ఉన్న 14 శాతం నుంచి సున్నా స్థాయికి తీసుకు రావాలి’ అని అన్నారు. హీరో సైకిల్స్‌ను హెచ్‌ఎంసీ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తోంది.
చదవండి : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో చైనాకు పోటీగా భారత్ దూకుడు!

మరిన్ని వార్తలు