ఎలక్ట్రిక్‌ సైకిల్‌, కిలోమీటర్‌ ఖర్చు 7 పైసలేనా

28 Jul, 2021 11:46 IST|Sakshi

ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా జోరందుకుంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఆటోమొబైల్‌ సంస్థలు రోజుకో కొత్త రకం ఎలక్ట్రిక్‌ వాహనాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్‌ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. బ్యాటరీ, మోటార్లను అమర్చడంతో పాటు నాలుగు రకాలైన పెడల్, పెడలెక్, త్రొటిల్, క్రూయిజ్ రైడింగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.25వేలు నిర్ణయించింది. 

ఈ సైకిల్‌ కు రెండు రకాలైన  నార్మల్‌ మోడ్‌, ఎలక్ట్రిక్‌ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్స్‌తో కావాలనుకుంటే సైకిల్‌గా తొక్కొచ్చు లేదంటే  ఎలక్ట్రిక్ డ్రైవింగ్ చెయ్యవచ్చు. సైకిల్‌ ఆఫ్‌, ఆన్‌ను బట్టి మీరు ఎంత వేగంతో వెళ్లాలనేది చెక్‌ చేసుకోవచ్చు. వాటర్‌ ప్రూఫ్‌ డెకల్స్‌ తో దీన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఈ వాటర్‌ ప్రూఫ్‌ డెకల్స్‌తో వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనైనా డ్రైవ్‌ చేయవచ్చు.

ఇక ఛార్జింగ్‌ విషయానికొస్తే..,ip67 లిథియం అయాన్‌ బ్యాటరీతో 3,4గంటల పాటు ఛార్జింగ్‌ పెట్టుకోచ్చు. 2ఏళ్లు వారెంటీగా ఉన్న ఈ సైకిళ్లను ఒక్కసారి ఛార్జింగ్‌ పెడిగే  25 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.  ఈ సైకిళ్లపై కిలోమీటర్‌కి 7పైసలే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సైకిళ్ల గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల వీటిని వాడేవారికి డ్రైవింగ్ లైసెన్స్, సైకిల్‌కి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి కాదు. 

చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాలు, 22 నగరాల్లో 500 ఛార్జింగ్‌ పాయింట్లు

మరిన్ని వార్తలు