హీరో మాస్ట్రో ఎడ్జ్‌ స్కూటర్‌, ధర ఎంతంటే..

8 Oct, 2020 07:58 IST|Sakshi

హీరో మోటోకార్ప్‌... మాస్ట్రో ఎడ్జ్‌ స్కూటర్‌

ధర రూ.72,950

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ బుధవారం మాస్ట్రో ఎడ్జ్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌ షోరూం వద్ద దీని ధర రూ.72,950 గా ఉంది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ 125 సీసీ మోడల్‌ 8 బ్రేక్‌ హార్స్‌ పవర్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

‘‘మా స్కూటర్‌ బ్రాండ్‌ మాస్ట్రో ఎడ్జ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. ఈ కొత్త మోడల్‌ చేరికతో బ్రాండ్‌ ఆకర్షణ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాము’’ అని హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ విభాగపు అధిపతి నవీన్‌ చౌహాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మార్కెట్‌ కోలుకునేందుకు రానున్న వారాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని చౌహాన్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు