Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ వాహనం..! లాంచ్‌ ఎప్పడంటే...?

1 Jan, 2022 19:55 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్స్‌, స్కూటర్ల తయారీదారు హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ బాట పట్టనుంది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేసేందుకు హీరో మోటో కార్ప్‌ సన్నద్ధమైంది. 

లాంచ్‌ ఎప్పుడంటే..!
భారత్‌తో సహా గ్లోబల్‌ మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తెచ్చేందుకు హీరో మోటోకార్ప్‌ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది.

2021లో భారీ సేల్స్‌...!
2021లో క్యాలెండర్‌ ఇయర్‌లో హీరో మోటోకార్ప్‌ అమ్మకాల్లో దుమ్మురేపింది. ఏ సంవత్సరంలో నమోదుచేయని విధంగా భారత్‌తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. క్యాలెండర్ ఇయర్ 2021 (జనవరి-డిసెంబర్)లో ఆసియా, ఆఫ్రికా, మధ్య అమెరికా,  కరేబియన్లలో  విస్తరించి దాని మార్కెట్‌లలో కంపెనీ 2.89 లక్షల యూనిట్ల మోటార్‌సైకిళ్లు,  స్కూటర్‌లను విక్రయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

చదవండి: భారత్‌లో తక్కువ ధరకే లభిస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్స్‌ ఇవే..!

మరిన్ని వార్తలు