రూ. 1,127 కోట్ల ఆర్డర్‌.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌

1 Jan, 2024 15:38 IST|Sakshi

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్‌ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ (OTN) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్‌ఎఫ్‌సీఎల్‌ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్‌ ఇచ్చింది. 

ఆప్టికల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు హెచ్‌ఎఫ్‌సీఎల్‌ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా  రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్‌పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ను నిలుపుతుందని భావిస్తున్నారు.

 

సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్‌వర్క్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్‌ఎఫ్‌సీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు