భారత్‌ సరికొత్త రికార్డు..! ‘చరిత్రలోనే తొలిసారిగా..! ఎన్నడూ లేని విధంగా..’

3 Jan, 2022 20:10 IST|Sakshi

డిసెంబర్‌ 2021 గాను భారత్‌ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. గత నెలలో భారత్‌ అత్యధికంగా 37 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను సాధించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయాల్‌ ట్విటర్‌లో తెలిపారు. ఇది 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే 37 శాతం అధిక వృద్ధిని సాధించిందని ఆయన అన్నారు.   

400 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా..!
వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయిలను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని పీయూష్‌ గోయాల్‌ ట్విటర్‌లో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఎగుమతుల్లో 80శాతంలోని టాప్ 10 ప్రధాన కమోడిటీ గ్రూప్స్‌   41% వృద్ధిని సాధించాయని గోయల్ చెప్పారు.

జనవరి 3 న  విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం...2021 (ఏప్రిల్-డిసెంబర్‌)లో అవుట్‌బౌండ్ షిప్‌మెంట్స్‌ గత ఆర్థిక సంవత్సరాన్ని మించాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 300 బిలియన్ల డాలర్ల ఎగుమతులు దాటినట్లు తెలుస్తోంది. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని పీయూష్‌ గోయల్‌ అన్నారు. 
 


చదవండి: 2022–23 అంచనా..వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యం రూ.18 లక్షల కోట్లు!

మరిన్ని వార్తలు