ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు భారీ డిమాండ్‌, బ్యాటరీల తయారీలోకి హిందాల్కో!

20 Jul, 2022 08:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం అల్యుమినియం–ఎయిర్‌ బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించనున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ఇందుకోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఫినర్జీ, ఐవోపీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. 

ఫినర్జీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కలిసి ఐవోసీ ఫినర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐవోపీ)ని ఏర్పాటు చేశాయి. తక్కువ బరువుండి, అధిక స్థాయిలో విద్యుత్‌ను నిల్వ చేయగలిగే సామర్థ్యం అల్యుమినియం–ఎయిర్‌ బ్యాటరీలకు ఉంటుంది. అలాగే వేగవంతంగా చార్జ్‌ కూడా అవుతాయి.

దీంతో ఖరీదైన చార్జింగ్‌ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయాల్సిన భారం తప్పుతుంది, అలాగే ఈ బ్యాటరీలున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అల్యుమినియం–ఎయిర్‌ బ్యాటరీలకు అవసరమయ్యే అల్యుమినియం ప్లేట్ల తయారీ, బ్యాటరీల్లో ఉపయోగించిన తర్వాత వాటిని రీసైక్లింగ్‌ చేయడం మొదలైన అంశాలకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో హిందాల్కోతో కలిసి ఫినర్జీ, ఐవోపీ పనిచేస్తాయి.   

మరిన్ని వార్తలు