హిందాల్కో చేతికి ఏపీలోని కుప్పం ప్లాంటు

18 Dec, 2021 10:16 IST|Sakshi

న్యూఢిల్లీ: అల్యూమినియం, కాపర్‌ తయారీలో ఉన్న హిందాల్కో ఇండస్ట్రీస్‌ తాజాగా నార్వే కంపెనీ హైడ్రోకు చెందిన భారత్‌లోని అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ రూ.247 కోట్లు. వచ్చే త్రైమాసికంలో లావాదేవీ పూర్తి అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ డీల్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం వద్ద ఉన్న హైడ్రోకు చెందిన ప్లాంటు హిందాల్కో చేతికి రానుంది. ఈ కేంద్రం సామర్థ్యం 15,000 టన్నులు.

ఈ తయారీ కేంద్రంలో ఆటో, బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్, ఇండస్ట్రియల్‌ అప్లికేషన్లకు కావాల్సిన ఉత్పత్తులు, పరిష్కారాలను ప్లాంటు అందిస్తోంది. ప్లాంటు చేరికతో హై–ఎండ్‌ ఎక్స్‌ట్రూజన్స్, ఫ్యాబ్రికేటెడ్‌ సొల్యూషన్స్‌ విభాగాల్లో ప్రత్యేక ఉత్పత్తుల తయారీ సామర్థ్యం అధికమవుతుందని హిందాల్కో ఎండీ సతీశ్‌ పాయ్‌ తెలిపారు.  హిందాల్కోను ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తోంది. 
 

మరిన్ని వార్తలు