హిందుజా టెక్‌ చేతికి డ్రైవ్‌ సిస్టమ్‌

7 Dec, 2022 09:45 IST|Sakshi

చెన్నై: ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ డ్రైవ్‌ సిస్టమ్‌ డిజైన్‌ను కొనుగోలు చేసినట్లు హిందుజా టెక్‌ తాజాగా పేర్కొంది. తద్వారా అభివృద్ధి నుంచి ఉత్పత్తివరకూ ఈమొబిలిటీ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే డైవర్సిఫైడ్‌ దిగ్గజం హిందుజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ  డీల్‌ విలువను వెల్లడించలేదు.

డ్రైవ్‌ సిస్టమ్‌ అంతర్జాతీయస్థాయిలో విశ్వాసపాత్ర ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నట్లు తెలియజేసింది. ఎలక్ట్రిఫైడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌కు కొత్తతరహా సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. యూకే, యూఎస్, ఆసియాలలో ఆటోమోటివ్, వాణిజ్య వాహనాలు, ఆఫ్‌హైవే, వైమానిక పరిశ్రమలకు అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్‌ సేవలందిస్తున్నట్లు పేర్కొంది.   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు