హెచ్‌యూఎల్‌ గూటికి ఒజైవా 

10 Dec, 2022 07:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒజైవా బ్రాండు సంస్థ జైవీ వెంచర్స్‌ ప్రయివేట్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 335 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో వెల్‌బీయింగ్‌ న్యూట్రిషన్‌ సంస్థ న్యూట్రిషన్‌ల్యాబ్‌ ప్రయివేట్‌లో 19.8 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది.

ఇందుకు నగదు రూపేణా రూ. 70 కోట్లు వెచ్చించనున్నట్లు హెచ్‌యూఎల్‌ తెలియజేసింది. తద్వారా ఆరోగ్యం, సంక్షేమ విభాగాలలో ప్రవేశించనుంది. దేశీయంగా హెల్త్, వెల్‌బీయింగ్‌ విభాగం అత్యంత వేగంగా పురోగమిస్తున్నట్లు యూరోమోనిటర్‌ డేటా పేర్కొంది. రూ. 30,000 కోట్ల మార్కెట్‌ పరిమాణానికి వీలున్నట్లు అంచనా వేసింది.

కాగా.. ఒజైవాలో మిగిలిన 49 శాతం వాటాను ముందస్తు అంచనా విలువ ప్రకారం మూడేళ్ల(36 నెలలు) తదుపరి కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌యూఎల్‌ వివరించింది. గతేడాది(2021–22) జైవీ రూ. 124 కోట్లు, వెల్‌బీయింగ్‌ రూ. 19.4 కోట్లు చొప్పున టర్నోవర్‌ సాధించినట్లు వెల్లడించింది.  

మరిన్ని వార్తలు