హింటాస్టికా ప్లాంటు ప్రారంభం

13 Jan, 2023 02:41 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హింద్‌వేర్, గ్రూప్‌ ఆట్లాంటిక్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ హింటాస్టికా ప్లాంటు ప్రారంభం అయింది. హైదరాబాద్‌ సమీపంలోని జడ్చర్ల వద్ద రూ.210 కోట్లతో దీనిని నెలకొల్పారు. హింద్‌వేర్‌ అట్లాంటిక్‌ బ్రాండ్‌లో వాటర్‌ హీటర్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 6 లక్షల యూనిట్ల వాటర్‌ హీటర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో స్థాపించారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. భారత్‌తోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తామని హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ చైర్మన్‌ సందీప్‌ సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. రెండున్నరేళ్లలో పూర్తి సామర్థ్యానికి చేరుకుంటామన్నారు. ఆ సమయానికి రూ.150 కోట్లతో 50 శాతం సామర్థ్యం అదనంగా జోడిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు