LinkedIn Survey: ఈ స్కిల్స్‌ ఉంటే జాబ్‌ గ్యారెంటీ.. లక్షల్లో వేతనాలు..!

4 Aug, 2021 10:58 IST|Sakshi

న్యూ ఢిల్లీ : కోవిడ్‌ 19  అదుపులో ఉండటంతో ఆర్థిక కార్యకాపాలు పుంజుకుంటున్నాయి. నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా కాలంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు తమ అర్హతకు తగ్గ జాబులు వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుం జాబ్‌మార్కెట్‌లో ఏ తరహా కోర్సులు, స్కిల్స్‌ ఉన్న వారికి డిమాండ్‌  ఉందనే అంశంపై  లింక్డ్‌ఇన్‌ సర్వే చేపట్టింది. 

ఈ స్కిల్స్‌కే డిమాండ్‌
కరోనా తర్వాత అన్ని రంగాలు ఒకే సారి కోలుకోలేదు. ఎంటర్‌టైన్‌ మెంట్‌, నిర్మాణ రంగం ఇంకా గాడిన పడాల్సి ఉండగా ఐటీ రంగం సాధారణ స్థికి చేరుకుంటోంది. అయితే  స్థూలంగా చూస్తే మార్కెట్లో నియామకాల సంఖ్య పెరిగిందని లింక్డ్‌ఇన్‌ సర్వేలో తేలింది.  అదే సమయంలో ఉద్యోగాలను అన్వేషించే వారి సంఖ్య కూడా వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్‌లోనే ఎక్కువ నియామకాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులోనూ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు ఉన్న యువ వర్కర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని లింక్డ్‌ఇన్‌ అంటోంది. ఈ స్కిల్స్‌ ఉన్నవారికి భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు కంపెనీలు వెనకడుగు వేయడం లేదని,  భారీ జీతం రావాలంటే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు తప్పని సరి అని లింక్డ్‌ఇన్‌ సూచిస్తోంది.

పెరుగుతున్న నియామకాలు
కరోనా సంక్షోభానికి ముందు నాటి  2019తో పోలిస్తే నియామకాల రేటు ఈ ఏడాది జూన్‌లో 42 శాతం అధికంగా నమోదయినట్టు  లింక్డ్‌ఇన్‌ ఇండియా తెలిపింది. సెకండ్‌ వేవ్‌  కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్‌ కాస్త తగ్గినా. మే  వచ్చేప్పటికీ  సాధారణ స్థితికి చేరుకోవడం మొదలైనట్టు తెలిపింది. మేలో 35 శాతం, జూన్‌లో 42 శాతం నియామకాలు రేటు అధికంగా నమోదు అయ్యాయి.

నియామకాల రేటు
ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న నియామకాలను లింక్డ్‌ఇన్‌లో నమోదు చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్యతో భాగించగా వచ్చిన అంకెను హైరింగ్‌ రేటుగా పరిగణలోకి తీసుకుని లింక్డ్‌ఇన్‌ ఈ నివేదిక రూపొందించింది. చాలాకాలంగా నిలిచిపోయిన నియామకాలను కంపెనీలు మళ్లీ చేపడుతుండటం వల్ల హైరింగ్‌ రేటు పెరుగుతున్నట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు