ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా

17 Oct, 2021 16:55 IST|Sakshi

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు గత 10 ఏళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే!. వీటికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన చరిత్ర గురుంచి తెలుసుకుందాం. 

ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర మొదటి సారిగా 1830లో ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ వాహనంలో గ్యాసోలిన్-శక్తితో పనిచేసే మోటారు కాకుండా ప్రొపల్షన్ కోసం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కారుతో పాటు, బైక్‌లు, మోటారు సైకిళ్ళు, పడవలు, విమానాలు, రైళ్లు అన్నీ విద్యుత్తుతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్నాయి కూడా...

ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభం
1828లో హంగేరియన్ అన్యోస్ జెడ్లిక్ అతను ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే చిన్న తరహా మోడల్ కారును కనుగొన్నాడు. సుమారు 1832లో రాబర్ట్ ఆండర్సన్ మొదటి క్రూడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తాడు. 1835లో మరొక చిన్న-తరహా ఎలక్ట్రిక్ కారును హాలండ్‌లోని గ్రోనింగెన్‌కు చెందిన ప్రొఫెసర్ స్ట్రాటింగ్, అతని సహాయకుడు క్రిస్టోఫర్ బెకర్ కలిసి రూపొందించారు. 1835లో వెర్మోంట్‌లోని బ్రాండన్ కు చెందిన కమ్మరి థామస్ డావెన్‌పోర్ట్ ఒక చిన్న తరహా ఎలక్ట్రిక్ కారును నిర్మించాడు.(చదవండి: Starlink: శాటిలైట్‌ ఇంటర్నెట్‌పై అసహనం)
 
1842లో థామస్ డేవెన్పోర్ట్, స్కాట్స్ మాన్ రాబర్ట్ డేవిడ్సన్ ఇద్దరూ కలిసి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని విజయవంతంగా తయారు చేశారు. కానీ, దీనిని చార్జ్ చేయాలంటే కొంచెం కష్టం అయ్యేది. ఫ్రెంచ్ వ్యక్తి గాస్టన్ ప్లాంటే 1865లో ఒక  మంచి బ్యాటరీని కనుగొన్నాడు. దానిలో సమస్యలు రావడంతో అతని తోటి దేశస్థులు కామిల్లె ఫౌర్ 1881లో ఎలక్ట్రిక్ శక్తిని నిల్వ ఉంచుకునే బ్యాటరీని మరింత మెరుగుపరిచారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ముఖ్యంగా బ్యాటరీ అవసరం. 1899లో బెల్జియంలో నిర్మించిన ఎలక్ట్రిక్ రేసింగ్ కారు 68 మైలు వేగంతో వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనిని కామిల్లె జెనాట్జీ రూపొందించారు.

1900-1920
ఎలక్ట్రిక్ కార్లను ఉదయం ప్రారంభించడానికి చాలా సమయం పట్టేది. తర్వాత  ఫోర్డ్ ఒక చౌకగ్యాస్ కారుని తయారు చేసింది. ఫోర్డ్ మోటార్ కంపెనీ మోడల్ టి పేరుతో పరిచయం చేసింది. అప్పట్లో ఇది చాలా ఉపయోగపడినప్పటికి  అనుకున్నంత రాణించలేక పోయింది.జనరల్ మోటార్స్ కాడిలాక్ టూరింగ్ ఎడిషన్ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత దశాబ్దాలలో గ్యాసోలిన్, డీజిల్ కార్ల జోరు పెరడంతో ఎలక్ట్రిక్ కార్లు కొద్ది కాలం పాటు కనుమరుగు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల పరిమిత డ్రైవింగ్ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం, భారీ బ్యాటరీల వల్ల నిలదొక్కుకోలేక పోయింది.(చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు)

1961-1970
ప్రధాన ఆటోమేకర్లు ఎలక్ట్రిక్ కార్ల తయారిని అపలేదు. బ్యాటరీలతో రన్ చేయడానికి జనరల్ మోటార్స్ ప్రయోగాలు చేసింది. అమెరికన్ మోటార్స్ కార్పొరేషన్ అమిట్రాన్ అనే ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కేవలం కొన్ని సంవత్సరాలలో అమిత్రాన్ ను అమ్మకానికి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ అలా, జరగలేదు.(చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్‌...!)

1971 -1980
ఆ తర్వాత ఫ్లోరిడాలోని సెబ్రింగ్-వాన్ గార్డ్ కంపెనీ సిటీకార్ పరిచయం చేసింది. ఇది కొన్ని సంవత్సరాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది. చివరికి 4,400 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. సిటీకార్ టాప్ స్పీడ్ గంటకు 38 మైళ్లు. కానీ, ఆ తర్వాత ఈవీ కూడా కనుమరుగు అయ్యాయి. లిథియం-అయాన్ బ్యాటరీ గుండె అయిన కోబాల్ట్-ఆక్సైడ్ క్యాథోడ్ ను జాన్ గుడ్ ఎనౌన్, అతని సహచరులు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో కనుగొన్నారు. రాబోయే దశాబ్దాల్లో, ఈ ఆవిష్కరణ ద్వారా సాధ్యమైన బ్యాటరీల వస్తాయి అని పేర్కొన్నారు.  2019లో గుడ్ ఎనౌన్, మరో ఇద్దరు పరిశోధకులకు లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది.

2000-2010
2003లో స్థాపించబడిన టెస్లా మోటార్స్ కంపెనీ మొదటి కారు టెస్లా రోడ్ స్టర్ రహదారి మీదకు రావడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇది రెండు సీట్ల స్పోర్ట్స్ కారు. దీని ధర $80,000 కంటే ఎక్కువ. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 200 మైళ్ల కంటే ఎక్కువ వెళ్ళగలదు. దీనిలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇక ఆ తర్వాత నుంచి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు ప్రస్తుతం మనదేశంలో టాటా మోటార్స్, హ్యూందాయి, టెస్లా, ఎంజి మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొనివస్తున్నాయి.

మరిన్ని వార్తలు