నోకియా సంచలన నిర్ణయం..! ఆ విభాగంలో చేతులెత్తేసింది..!

9 Mar, 2022 20:36 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం నోకియా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు స్వస్తి పలికేందుకు నోకియా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను నోకియా లాంచ్‌ చేసే ఆస్కారం లేదు.  

బడ్జెట్‌ ఫోన్లపై మొగ్గు..!
నోకియా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను లేటుగా స్వీకరించినా..స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీలోకి తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది. కాగా తాజాగా పలు దిగ్గజ కంపెనీల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఉత్పత్తి నిలిపివేసేందుకు నోకియా సిద్దమైంది. వీటి బదులుగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఇటీవల బార్సిలోనాలో ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో బడ్జెట్ రేంజ్‌ Nokia C సిరీస్ ఫోన్స్‌ను ప్రకటించింది. దీంతో నోకియా నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌కు స్వస్తి పలకనున్నట్లుగా నిరూపితమైంది.

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ఆడమ్‌ ఫెర్గూసన్‌ మాట్లాడుతూ... 800 డాలర్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్స్‌ తయారుచేయడం కష్టంతో కూడుకుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీటి సేల్స్‌ కూడా ఆశించిన మేర లేవని ఆడం వెల్లడించారు. ఎంట్రీ లెవల్‌, మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేస్తూ..5జీ  సెగ్మెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  

చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...! 

>
మరిన్ని వార్తలు