Knight Frank's Affordability Index 2021: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్‌ విషయానికి వస్తే..!

29 Dec, 2021 20:13 IST|Sakshi

కోవిడ్‌-19 రాకతో రియాల్టీ రంగం పూర్తిగా దెబ్బతింది. వరుస లాక్‌డౌన్స్‌తో  ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. కరోనా ఉదృత్తి కాస్త తగ్గడంతో మళ్లీ రియల్‌ బూమ్‌ పట్టాలెక్కింది. కరోనా మహమ్మారి భూముల ధరలు, గృహ నిర్మాణ రంగంపై కొంతమేర ప్రభావం చూపాయి. ఇక దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో ఇండ్ల ధరలు భారీగానే పెరిగాయి. కాగా అత్యంత తక్కువ ధరలకే ఇళ్లు వచ్చే నగరాల జాబితాను ప్రముఖ రియాల్టీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ‘ అఫర్డబిలిటీ ఇండెక్స్‌-2021’ జాబితాను విడుదల చేసింది.  

అహ్మదాబాద్‌లో అగువకే ఇండ్లు..!
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలిచింది. ఈ నగరంలో ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. అయితే ముంబై మహానగరంలో సొంత ఇళ్లును సొంతం చేసుకోవాలంటే భారీగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. నైట్‌ ఫ్రాంక్‌ ఆయా నగరాల్లోని గృహ ఈఎంఐ, మొత్తం ఆదాయ నిష్పత్తి దృష్టిలో ఉంచుకొని ఈ జాబితాను విడుదల చేసింది. 

నివేదికలోని కొన్నిముఖ్యాంశాలు..!

  • 2021లో అహ్మదాబాద్  20 శాతం, పుణె 24 శాతంతో దేశంలోనే అత్యంత సరసమైన గృహా రంగ మార్కెట్‌గా అవతరించాయి.
  • ముంబైలో మినహా 53 శాతం స్థోమత నిష్పత్తితో భారత్‌లోనే అత్యధిక ధరలు గల నగరంగా నిలిచింది.
  • ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్థోమత నిష్పత్తి గరిష్టంగా 2020లో 38 శాతం నుంచి 2021లో 28 శాతానికి మెరుగుపడిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
  • అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ స్థోమత నిష్పత్తి 29 శాతం, బెంగళూరు 26 శాతం, చెన్నై, కోల్‌కతా 25 శాతంగా నమోదైనాయి. అంటే బెంగళూరు, చెన్నె, కోల్‌కత్తా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త గృహాల కోసం ఎక్కువ డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది. 

తక్కువ వడ్డీ రేట్లు...
నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం.... ఈ ఏడాదిలో గృహాల ధరలలో క్షీణత , చాలా కాలంగా వస్తోన్న తక్కువ వడ్డీరేట్లు ఆయా నగరాల్లో కొత్త ఇంటిని సొంతం చేసుకునే వారి స్థోమత గణనీయంగా పెరగడానికి సహాయపడిందని పేర్కొంది.

అఫర్డబిలిటీ సూచిక ..!
స్థోమత సూచిక అనేది ఒక నిర్దిష్ట నగరంలోని హౌసింగ్ యూనిట్ ఈఎంఐకు నిధులు సమకూర్చడానికి ఒక కుటుంబానికి అవసరమయ్యే ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. కాబట్టి, ఒక నగరం స్థోమత సూచిక స్థాయి 40 శాతం ఉంటే ఆ నగరంలోని కుటుంబాలు ఇంటి కోసం నిధులు సమకూర్చడానికి వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.  50 శాతం కంటే ఎక్కువ ఉంటే ఇంటి ధరలు భరించలేనిదిగా పరిగణించబడుతుంది. 

చదవండి: ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్‌ వైడ్‌గా..


 

>
మరిన్ని వార్తలు