ఫ్రిజ్‌, టీవీ కొనే ఆలోచన ఉందా? వెంటేనే కొనండి, లేదంటే!

30 Mar, 2021 12:39 IST|Sakshi

అంతర్జాతీయంగా ఎల​క్ట్రానిక్‌ చిప్స్ కొరత

స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు గణనీయంగా పెరగడంతో...

పెరిగిన మూలధన ఖర్చులు.. వినియోగదారులపై ప్రభావం

ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌లు, టీవీలు గృహోపకరణాలను కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.  లేకపోతే రానున్న రోజుల్లో ఎల​క్ట్రానిక్‌ వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఆయా వస్తువుల రేట్లు భారీగా పెరిగనున్నాయి. అంతర్జాతీయంగా ఎల​క్ట్రానిక్‌ చిప్స్ కొరత ఏర్పడటంతో ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌ ఇతర గృహోపకరణాల ఉ‍త్పత్తిపై ప్రభావం చూపనుందని వాల్‌పుల్‌ కార్పోరేషన్‌ ప్రెసిడెంట్‌ జాసన్‌ ఐ తెలిపారు. ఇప్పటికే ఎల​క్ట్రానిక్‌ చిప్స్‌ కొరత కార్ల ఉత్పత్తి కంపెనీలపై , గ్యాడ్జెట్స్‌‌ కంపెనీలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది.

ప్రపంచంలోని అతిపెద్ద గృహోపకరణాల సంస్థలలో ఒకటైన యూఎస్‌ ఆధారిత సంస్థ వాల్‌పుల్ ఎగుమతుల్లో వెనుకబడి ఉంది. చైనాలో ఉత్పత్తయ్యే ఈ సంస్థ ఉత్పత్తులు యూరప్, యునైటెడ్ స్టేట్స్‌కు ఎక్కువగా ఎగమతి అవుతుంటాయి. ఎల​క్ట్రానిక్‌ వస్తువుల కొరత ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని.. గత కొన్ని నెలలుగా ఎగుమతులు  25 శాతానికి తగ్గాయని షాంఘైలో జరిగిన వరల్డ్ ఎలక్ట్రానిక్స్‌ ఎక్స్‌పోలో జాసన్‌ ఐ పేర్కొన్నారు. ఇది రానున్న రోజుల్లో పొంచి ఉన్న ఉపద్రవమని అభిప్రాయపడ్డారు. చైనా దేశ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సరిపోయినా, ఎగుమతులను పూర్తిచేయడంలో విఫలం అయ్యే అవకాశలున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ కొరత ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో చైనా అవసరాలు తీరడం కూడా కష్టం కావొచ్చని పేర్కొన్నారు.

స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు గణనీయంగా పెరగడంతో...
మైక్రోవేవ్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు అవసరమైన మైక్రో కంట్రోలర్లను, ప్రాసెసర్లను సర్దుబాటు చేయడంలో కంపెనీలు ఇబ్బందిపడ్డాయి. క్వాల్కమ్‌ కంపెనీ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రానిక్‌  చిప్స్‌ కొరతను ఎదుర్కొన్నాయి. డిసెంబర్‌ చివరలో ఏర్ఫడిన ఎలక్ట్రానిక్‌  చిప్స్‌ కొరత ఆటోమోబైల్‌ రంగాల కంపెనీలను కుదిపివేసింది. ప్రపంచాన్ని కరోన మహామ్మారి పీడిస్తున్న సమయంలో స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు గణనీయంగా పెరగడంతో ఎలక్ట్రానిక్‌  చిప్స్‌ కొరత ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు.

పెరిగిన మూలధన ఖర్చులు.. వినియోగదారులపై ప్రభావం
26,000 మంది ఉద్యోగులు ఉన్న చైనాకు చెందిన వైట్ గూడ్స్ (గృహోపకరణాల) తయారీ సంస్థ హాంగ్‌జౌ రోబామ్ అప్లయన్సెస్ కో లిమిటెడ్ మార్కెటింగ్‌ డైరెక్టర్‌  డాన్‌ యే మాట్లాడుతూ.. తగినంత మైక్రో కంట్రోలర్‌లను సమాకుర్చుకోవడంలో తమ కంపెనీ విఫలమవడంతో మార్కెట్‌లోకి  కొత్త హై-ఎండ్ మోడల్‌  స్టవ్ వెంట్ విడుదలకు  నాలుగు నెలల జాప్యం ఏర్పడిందని తెలిపారు. ఎలక్ట్రానిక్‌  చిప్స్‌ కొరత కారణంగా, కంపెనీల  మూలధన ఖర్చులు పెరిగాయని.. దీంతో సర్వసాధారణంగా వినియోగదారులపై ఈ భారం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు