ఒక్క చార్జింగ్‌తో గంటకు 40 కి.మీ: హొంమేడ్‌ ఎలక్ట్రిక్ సైకిల్‌ మేకింగ్‌ వీడియో 

25 Aug, 2022 12:37 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కార్బన ఉద్గారాలను తగ్గించే లక్క్ష్యంతోపాటు,  ఇంధన భారాని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు  రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ వేవ్ టూవీలర్‌, త్రీవీలర్‌ సెగ్మెంట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సైకిళ్లు ఎలక్ట్రిక్  మోడ్‌లో వచ్చేస్తున్నాయి.

అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు  హై రేంజ్‌లోఉండటంతో,  కార్లు , బైక్స్‌తో సహా అన్ని రకాల ఆటోమొబైల్స్ కోసం ఇటువంటి కన్వర్షన్ కిట్‌లను చూశాం.  దీంతో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్, టూవీలర్ సెగ్మెంట్లో ఈ-వాహనాల భారాన్నిమోయలేని వారు కన్వర్షన్‌ కిట్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగానే స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌  విశేషంగా నిలుస్తోంది.  

ఇంట్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్
ప్రముఖ యూట్యూబర్ ఇలాంటి వీడియోనొకదాన్ని అప్‌లోడ్  చేశారు. కన్వర్షన్‌ కిట్‌ సహాయంతో ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ వీడియోను పబ్లిష్‌ చేశాడు.  ఎలక్ట్రిక్ మోటారు, 36 V 7.5 Ah లిథియం-అయాన్ బ్యాటరీ, కంట్రోలర్, పెడల్ అసిస్ట్, కొత్త థొరెటల్, బ్రేక్ లివర్లు  ఇలా ప్రతి భాగం ఎలా మరియు ఎక్కడ అమర్చాడో యూట్యూబర్ వివరించాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి ఛార్జింగ్‌తో గంటకు 40 కిమీ వేగంతో దూసుకుపోవచ్చట. మరి ఈ ఇంట్రస్టింగ్‌ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి. అయితే దీనికి నిపుణుల పరిశీలన అవసరమని గుర్తించండి. కేవలం సమాచారం కోసమే ఈ వీడియోను అందిన్నామని గమనించగలరు.

మరిన్ని వార్తలు