కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్‌!

17 Dec, 2022 15:08 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్‌ ఇండియా కార్ల ధరలను జనవరి 23 నుంచి పెంచుతోంది. మోడల్‌నుబట్టి ధర రూ.30,000 వరకు అధికం కానుంది. 

ముడిసరుకు వ్యయాలు దూసుకెళ్లడం, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీ చేపడుతుండడం ఇందుకు కారణమని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కాలుష్యం ఏ మేరకు విడుదల అవుతుందో తెలుసుకునే పరికరాన్ని కార్లలో ఏర్పాటు చేయాలన్న నిబంధన 2023 ఏప్రిల్‌ నుంచి అమలులోకి వస్తోంది. 

ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్‌ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ ఇప్పటికే ప్రకటించాయి.    

మరిన్ని వార్తలు