హోండా నుంచి న్యూ మోడల్‌ కారు

5 May, 2022 10:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ కొత్త మోడల్‌ కారును లాంచ్‌ చేసింది. నాగోల్‌ గ్రీన్‌  హోండా షోరూమ్‌ వద్ద  బుధవారం ‘ఈ–హెవ్‌’ మోడల్‌ కారును హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు (హెచ్‌ఎమ్‌ఎస్‌ఎస్‌) ఎండీ ఎం.దానకిశోర్‌ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్‌ హెడ్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్‌’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనమని చెప్పారు. మెయిన్‌ స్ట్రీమ్‌ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్‌తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్‌ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.   

(చదవండి: యూట్యూబ్‌ క్రియేటర్లకు గూగుల్‌ భారీ షాక్‌!)

మరిన్ని వార్తలు