కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

2 Mar, 2023 13:38 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌' భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదవ జనరేషన్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు, కాగా టాప్-స్పెక్ సిటీ హైబ్రిడ్ ధర రూ. 20.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేటెడ్ ఫేస్‌లిఫ్ట్‌ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.

కంపెనీ ఈ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 5,000, డీలర్‌షిప్‌లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాలి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ & ధరలు:

  • ఎస్‌వి: రూ. 11.49 లక్షలు
  • వి: రూ. 12.37 లక్షలు
  • విఎక్స్: రూ. 13.49 లక్షలు
  • జెడ్ఎక్స్: రూ. 14.72 లక్షలు

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బంపర్‌, గ్రిల్, క్రోమ్ బార్ వంటి వాటిని కలిగి ఎల్ఈడీ లైట్స్, స్వెప్ట్‌బ్యాక్ టెయిల్ ల్యాంప్‌ పొందుతుంది. వెనుక వైపు కొత్తగా డిజైన్ చేసిన బంపర్ చూడవచ్చు, అంతే కాకుండా ఈ అప్డేటెడ్ మోడల్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ పెయింట్ షేడ్‌లో చూడచక్కగా కనిపిస్తుంది.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ బేస్ మోడల్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు సివిటి గేర్‌బాక్స్ పొందుతాయి. ఈ కొత్త మోడల్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లను పొందుతుంది.

కంపెనీ ఇప్పుడు హోండా సిటీ హైబ్రిడ్‌ వేరియంట్‌లోని ADAS టెక్నాలజీకి "లో-స్పీడ్ ఫాలో" ఫంక్షన్ అని పిలువబడే ఒక కొత్త ఫీచర్‌ను జోడించింది. ఇది ముందున్న వాహనానికి దూరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులోని లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వల్ల కారు ముందుకు కదిలినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు వైర్‌లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌ వంటి ఫీచర్స్‌తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ పెట్రోల్, సిటీ హైబ్రిడ్ రెండింటిపైన మూడు సంవత్సరాలు/అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అందిస్తుంది. దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 121 బీహెచ్‌పి పవర్ అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ eCVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ ఈ రెండు ఇంజిన్లను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది.

మరిన్ని వార్తలు