హోండా కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ అదిరిపోయింది!

10 Aug, 2021 20:44 IST|Sakshi

'యు-జీవో' పేరుతో తక్కువ ధరలో హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను పట్టణ రైడింగ్ ప్రియుల కోసం డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. లైట్ వెయిట్ ఈ-స్కూటర్ రెండు వెర్షన్లలో తీసుకొనివచ్చారు. యు-జీవోల స్టాండర్డ్ మోడల్ 1.2కెడబ్ల్యు హబ్ మోటార్ తో వస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 53 కిలోమీటర్లు. లోయర్ స్పీడ్ మోడల్ 800కెడబ్ల్యు హబ్ మోటార్, 1.2కెడబ్ల్యు గరిష్ట పవర్ తో పనిచేస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 43 కిలోమీటర్లు. అదనంగా, రెండు మోడల్స్ 1.44కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన 48వీ, 30ఎహెచ్ గల లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తాయి. 

కొత్త ఈ-స్కూటర్ లో ఉన్న లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లేలో రైడర్ వేగం, దూరం, ఛార్జ్ వంటి కీలకమైన సమాచారంతో పాటు ఇతర వివరాలు కనిపిస్తాయి. ముందు భాగంలో ట్రిపుల్ బీమ్ ఎల్ఈడి హెడ్ లైట్, ప్రధాన క్లస్టర్ చుట్టూ ఎల్ఈడి డిఆర్ఎల్ స్ట్రిప్ ఉంది. యు-జీవో 12 అంగుళాల ఫ్రంట్, 10 అంగుళాల రియర్ అలాయ్ చక్రాలతో వస్తుంది. దీనిలో 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ కెపాసిటీ ఉంది. ఇతర ఈ-స్కూటర్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ.

యు-జీవో బేస్ మోడల్ ధర 7,499 ఆర్ఎంబి(సుమారు రూ. 85,342), ప్రామాణిక మోడల్ ధర 7,999 ఆర్ఎంబి(సుమారు రూ. 91,501)గా ఉంది. ప్రస్తుతానికి జపనీస్ ఆటోమేకర్ చైనా మార్కెట్ కోసం యు-జివోను మాత్రమే తీసుకొచ్చింది. సంస్థ త్వరలో తన ఈ-స్కూటర్ ను ఇతర మార్కెట్లకు పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. హోండా యు-జీవో భారతీయ మార్కెట్లో విడుదల అయితే రాబోయే ఓలా ఈ-స్కూటర్ వంటి వాటితో పోటీ పడుతుంది. అయితే, విడుదలపై కంపెనీ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

 

మరిన్ని వార్తలు