హోండా కస్టమర్లకు అలర్ట్.. వెంటనే బైక్స్ షో రూమ్ కి తీసుకెళ్లండి

16 Jun, 2021 20:01 IST|Sakshi

మీ దగ్గర కొత్త హోండా మోటార్ సైకిల్ వాహనం ఉందా? అయితే, వెంటనే షో రూమ్ తీసుకెళ్లండి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లలలో సమస్య కారణంగా మన దేశంలోని కొన్ని మోడళ్లను రీకాల్ చేస్తుంది. వెనక్కి పిలిపించిన వాటిలో హోండా యాక్టివా 5జీ, హోండా యాక్టివా 6జీ, హోండా యాక్టివా 125, సిబి షైన్, హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, హెచ్ నెస్ సీబి 350, సీబి 300ఆర్ ఉన్నాయి. రీకాల్ చేయబడ్డ మొత్తం యూనిట్ సంఖ్య ఇంకా తెలియదు. రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ల సమస్య వల్ల రాత్రి సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందు వెళ్తున్న వాహనం సరిగా కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. 

అందుకే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నవంబర్ 2019 నుంచి జనవరి 2021 మధ్య తయారు చేయబడ్డ మోడల్స్ కు వారెంటీ స్టేటస్ తో సంబంధం లేకుండా కొత్త రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ ని ఉచితంగా అధీకృత హెచ్ఎంఎస్ఐ డీలర్ లు మార్చానున్నట్లు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి కంపెనీ జూన్ 1, 2021న రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది. వాహనాన్ని తనిఖీ చేయడానికి అవసరమైతే రీప్లేస్ మెంట్ కోసం కాల్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులను చేరుకొనున్నట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. అదేవిధంగా, కస్టమర్ లు కంపెనీ వెబ్ సైట్ లో విఐఎన్ ని కూడా నమోదు చేయవచ్చు. హెచ్ ఎమ్ ఎస్ఐ డీలర్ షిప్ లు/విడిభాగాల డిస్ట్రిబ్యూటర్ ల వద్ద అనుమానిత స్పేర్ పార్టుల స్టాక్ కూడా రీకాల్ చేయనున్నారు. అమెరికాలోలో కూడా ఇలాంటి సమస్య కారణంగా హోండా మోటార్ కంపెనీ రీకాల్ చేసింది. యుఎస్ఎలో 28,528 మోటార్ సైకిళ్లలో లోపభూయిష్టమైన రియర్ రిఫ్లెక్టర్ ఫిట్ మెంట్ లను మార్చేసింది. 

చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు