Honda Cars పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు

4 Nov, 2022 15:09 IST|Sakshi

న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V  లాంటి మోడల్స్‌  రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్‌ కస్టమర్‌లు తమకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది.

హోండా డబ్యుఆర్‌-వీ
డబ్యుఆర్‌-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో  రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్‌లు తదితరాలు ఉన్నాయి.

హోండా అమేజ్
సబ్-కాంపాక్ట్ సెడాన్‌ హోండా అమేజ్‌ కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు,  అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్,  రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం. 

హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్‌పై  25 వేల తగ్గింపు లభ్యం. 

హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్‌పై  రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్‌ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది.

మరిన్ని వార్తలు