-

Honda: పొరపాటున అడిషనల్‌ బోనస్‌, ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు

22 Sep, 2022 12:14 IST|Sakshi

ఓవర్‌ బోనస్‌ పే చేశాం..రీఫండ్‌ ఇచ్చేయండ్రా బాబూ : హోండా

న్యూఢిల్లీ: జపాన్‌ కార్‌ మేకర్‌ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్‌విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్‌లో అనుకోకుండా అదనపు  మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన  ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది.  

తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్‌ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్‌లో కట్‌ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!)

సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్‌లో  మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా  చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు
దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్‌ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్‌లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా  విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు  వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు