హోండా నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌!

8 Jun, 2021 10:11 IST|Sakshi

ఈవీ బైక్‌కి అరాయ్‌లో టెస్టింగ్‌ 

త్వరలో ఇండియాలో లాంఛ్‌ ?

వెబ్‌డెస్క్‌: ఎలక్ట్రిక్‌ బైక్‌ మార్కెట్‌లోకి వచ్చేందుకు జపాన్‌ ఆటోమోబైల్‌ దిగ్గజ కంపెనీ హోండా సన్నాహకాలు చేస్తోంది. జపాన్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న హోండా బెన్‌లే మోడల్‌ని ఇండియాకి తీసుకురానుంది. 

అరాయ్‌లో టెస్టింగ్‌
హోండా సంస్థ 2019లో బెన్‌లే ఎలక్ట్రిక్‌ బైక్‌లను రూపొందించింది. అక్కడ ప్రస్తుతం బెన్లే సిరీస్‌లో నాలుగు బైక్‌లు రిలీజ్‌ అయ్యాయి. ఇదే బైక్‌ను ఇండియా మార్కెట్‌లో ప్రవేశపెట్టే ఆలోచనలో హోండా సంస్థ ఉంది. ఈమేరకు పూణేలో ఉన్న ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (అరాయ్‌)లో ఈ బైక్‌కు టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు.
 
డెలివరీకి తగ్గట్టుగా
ఇండియాలో ఎలక్ట్రిక్‌ బైక్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ బైకులకు మంచి మార్కెట్‌ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇండియాలో ఈ కామర్స్‌ రంగం జోరుమీదుంది. హోండా బెన్లే బైక్‌ డిజైన్‌ సైతం డెలివరీ సర్వీసులకు అనుకూలంగా ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. మరోవైపు ఈ బైకులకు కీలకమైన బ్యాటరీ విషయంలోనూ హోండా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. సులువుగా బ్యాటరీ మార్చుకునేలా బైక్‌ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తోంది. 
 

మరిన్ని వార్తలు