హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు

7 Jun, 2021 16:18 IST|Sakshi

జపాన్‌ దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హోండా సరికొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. హోండా ఈ అత్యంత ప్రసిద్ధ మోడల్‌కు హోండా ఎస్660 అని పేరు పెట్టింది. ఇది రెండు సీట్ల కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఎస్660ల తయారిని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల హోండా ప్రకటించింది. మొదటి సరిగా దీని ప్రోటో టైపు మోడల్ ను 2017 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించారు. 2019 సంవత్సరంలోనే హోండా దీని డిజైన్ పేటెంట్లను దాఖలు చేసింది. 

ఈ కొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారుకి కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. హోండా ఈ హ్యాచ్‌బ్యాక్, బ్లాక్-అవుట్ ఎన్‌క్లోజ్డ్ గ్రిల్ ఏరియా టేకు హోండా ఈ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే వృత్తాకార హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. దీని అండర్‌పిన్నింగ్స్ రియల్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను హ్యాచ్‌బ్యాక్‌తో తీసుకొచ్చింది. అదే సమయంలో 35.5kWh బ్యాటరీ తీసుకొనిరావచ్చు. ఇది 154 హెచ్‌పీ సామర్ధ్యం గల ఈ కారు ఒక్కసారి చార్జ్ చేస్తే 220 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. అయితే రెండు డోర్ల ఎలక్ట్రిక్ కారును హోండా కంపెనీ భారత్‌కు తీసుకువస్తుందా రాదా? అనే విషయంపై సందిగ్థత ఉంది. మన దేశానికి తీసుకొనిరాకపోవడానికి ప్రధాన కారణం స్పోర్ట్స్ కారు కావడంతో పాటు దీని ధర చాలా ఎక్కువగా ఉండటమే అనిపిస్తుంది. చూడాలి మరి హోండా ఈ కారును మన దేశంలో తీసుకొస్తుందా? అనేది.

చదవండి: చిన్న ఎస్ఎంఎస్‌తో ఆధార్ డేటాను రక్షించుకోండి

మరిన్ని వార్తలు