షాకింగ్‌ సేల్స్‌ : కేవలం నిమిషంలోనే స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు

26 Jun, 2021 14:24 IST|Sakshi

హానర్‌ 50సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల

కేవలం నిమిషంలోనే అమ్మకాలు

స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం హానర్‌ విడుదల చేసిన హానర్‌ 50, హానర్‌ 50 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు కేవలం నిమిషంలోనే అమ‍్ముడయ్యాయి. ఈ అమ్మకాల్ని హానర్‌ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ స‍్థాయిలో 2జీ, 4జీ, ఇప‍్పుడు 5జీ విప్లవం మొదలైంది. దీంతో స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ 5జీ స్మార్ట్‌ ఫోన్ల తయారీ పై దృష్టిసారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేయగా తాజాగా హువాయే సబ్‌ బ్రాండ్‌ గా పేరొందిన హానర్‌ కంపెనీ చైనా కేంద్రంగా హానర్‌ 50, హానర్‌ 50ప్రో, హానర్‌ 50ఎస్‌ఈ ఫోన్లపై శుక్రవారం రోజు ఫ్రీ ఆర‍్డర్‌ను ప్రకటించింది. అలా ఆర్డర్‌ ప్రకటించింది లేదో కేవలం నిమిషం వ్యవధిలోనే హానర్‌ 50 సిరీస్‌ ఫోన్లు అమ్ముడయ్యాయి. చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్‌ని బట్టి డిస్కౌంట్‌


హానర్‌ 50ప్రో ఫీచర్స్‌ విషయానికొస్తే 

6.72అంగుళాలు 120 హెచ్‌జెడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

క్వాల్‌కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 
 
12జీబీ ర్యామ్‌ తో 778జీ ప్రాసెసర్‌

108 ఎంపీ - 8ఎంపీ-2ఎంపీ-2ఎంపీతో కెమెరా సెటప్‌ 

32 ఎంపీ + 12ఎంపీ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా 

4,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది

50ప్రో ధర : ఇండియన్‌ కరెన్సీలో రూ. 42,380గా ఉంది. 

హానర్‌ 50 ఫీచర్స్‌ అండ్‌ ప్రైస్‌ 

హానర్‌ 50 సైతం 120 హెచ్‌ రిఫ్రెష్‌ రేట్‌ తో 6.57 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే 

778జీ ఎస్‌ఓసీ 12జీబీ ర్యామ్‌ వేరియంట్‌ తో వస్తుంది

క్వాడ్‌ రేర్‌ కెమెరా సెటప్‌ తో పాటు 108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది

32ఎంపీ తో సింగిల్‌ సెల‍్ఫీ కెమెరా 
 
4,300ఎంఏహెచ్‌ బ్యాటరీ తో రూ. 30,922కే అందిస్తుంది.  

హానర్‌ 50ఎస్‌ఈ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌ 

హానర్‌ 50ఎస్‌ఈ  6.78 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ 

మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 900 ప్రాసెసర్‌

8జీబీ ర్యామ్‌ నుంచి 128జీబీ వరకు స్టోరేజ్‌

16 ఎంపీల సెల్ఫీ కెమెరా

108ఎంపీ + 8ఎంపీ +2ఎంపీ+2ఎంపీల రేర్‌ కెమెరా సెటప్‌ 

 4,300ఎంఏహెచ్‌ బ్యాటరీ తో రూ. 27,480కే అందిస్తుంది.  
 

మరిన్ని వార్తలు