హాప్‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌: అదిరే..అదిరే..!

6 Sep, 2022 10:49 IST|Sakshi

హాప్‌ సరికొత్త ఈ-బైక్స్‌ లాంచ్‌

ధరల  శ్రేణి  రూ.1.25 లక్షలు, రూ.1.40 లక్షలు

రూ. 200 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ప్రముఖ ఈవీ బైక్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఈవీ సెగ్మెంట్‌లోకి దూసుకొస్తోంది.  తాజాగా దేశీయ మార్కెట్లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్స్‌ రెండు మోడళ్ళను లాంచ్‌ చేసింది. ఆక్సో మోడల్‌లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.1.25 లక్షలు, రూ.1.40 మధ్య ఉండనున్నాయి.

వినియోగదారులు తమ సమీప హాప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, లేదా ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్ బైక్స్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 5వేల ప్రీ-లాంచ్ రిజిస్ట్రేషన్‌లు సొంతం చేసుకున్నామనీ, మరింత హైపర్‌గ్రోత్‌ను అంచనా వేస్తున్నామని హాప్  ఫౌండర్‌,  సీఈవో కేతన్ మెహతా అన్నారు. రానున్న రోజుల్లో తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తామన్నారు. అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం తోపాటు, చార్జింగ్‌ సదుపాయల కోసం రూ.200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ఫీచర్లు
మూడు రైడ్ మోడ్‌లను (ఎకో, పవర్ , స్పోర్ట్) లో ఈ  బైక్స్‌ లభ్యం. బైక్ ప్రముఖ ఫీచర్ల విషయానికి వస్తే  IP67 రేటింగ్‌ 5 అంగుళాల అడ్వాన్స్‌డ్‌   ఇన్ఫో డిస్‌ప్లే,  72 V ఆర్కిటెక్చర్‌తో 6200 వాట్ పీక్ పవర్ మోటార్‌తో 200 Nm వీల్ టార్క్‌ను అందజేస్తుంది. స్మార్ట్ బీఎంఎస్‌,811 NMC సెల్స్‌తో కూడిన అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీతో ఆధారితమైన Oxo's 3.75 KWh బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అందించింది.  3.75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్‌తో తయారైన ఈ బైకు ఒక్కసారి చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు  ప్రయాణిస్తుంది.అ లాగే  కేవలం నాలుగు గంటల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు రీచార్జి అవుతుందని కేతన్‌ మెహతా వెల్లడించారు. అంతేకాదు కేవలం పోర్టబుల్ స్మార్ట్ ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్‌లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు