మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. కుర్రకారు ఫిదా కావాల్సిందే!

4 Oct, 2021 15:58 IST|Sakshi

దేశంలో పెట్రోల్ ధరలు పెరగుతుండటంతో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులలో హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒకటి. ఈ హోప్ ఎలక్ట్రిక్ త్వరలో దేశీయ మార్కెట్లో తన టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. హోప్ ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఓఎక్స్ఓ(OXO). (చదవండి: అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన టాటా మైక్రో ఎస్‌యూవీ)

జైపూర్‌కు చెందిన ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ త్వరలో ఓఎక్స్ఓ(OXO)ను మార్కెట్లోకి తీసుకొని రావడం కోసం టెస్ట్ డ్రైవ్ చేస్తుంది. దీనికి సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో తెగ వైరల్ అవూతున్నాయి. Hop OXO బైక్ డిజైన్, స్టైలింగ్ స్పోర్ట్స్ బైక్ తరహాలో ఉన్నాయి. ఇది ఆల్-ఎల్ఈడి సెటప్ తో వచ్చే అవకాశం ఉంది. ట్రెండీ వైజర్, స్పియర్ ఆకారంలో టర్న్ ఇండికేటర్లు, స్లీక్ ఎల్ ఈడి డిఆర్ఎల్, సింగిల్ సీట్ డిజైన్, షార్ట్ టెయిల్ సెక్షన్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి. బైక్ ఏరోడైనమిక్ ప్రొఫైల్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. 

ఈ ఏరోడైనమిక్ వల్ల బైక్ మైలేజ్ ఎక్కువ ఇస్తుందిహోప్ ఓఎక్స్ఓ టాప్ స్పీడ్ గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని సమాచారం. ఈ-బైక్ 30 సెకన్ల లోపు తన టాప్ స్పీడ్ చేరుకుంటుంది. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. హోప్ ఓఎక్స్ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, సింగిల్ లేదా డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో రావచ్చు. వాహన వినియోగాదారులు కోరుకునే అన్ని ఫీచర్స్ ఈ కొత్త Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల హోప్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ మంది వాహనప్రియులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు