అదిరిపోయిన హోప్ ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా ఎక్కువే!

27 Feb, 2022 21:21 IST|Sakshi

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం(హోప్ ఆక్సో) మార్కెట్లోకి వచ్చే ముందు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లీథియం-అయాన్ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణిస్తుంది. భారతదేశంలో ఎంపిక చేసిన డీలర్ భాగస్వాములతో #OXOSNEAKPEEK క్లోజ్డ్ లూప్ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. 

ఢిల్లీ, జైపూర్, జోధ్ పూర్, పాట్నా, కోల్ కతా, హైదరాబాద్, లూధియానా వంటి మరెన్నో 20 ప్రధాన నగరాల్లో 30000 కిలోమీటర్లకు పైగా టెస్టింగ్ చేసినట్లు ఈవీ తయారీదారు పేర్కొంది. కంపెనీ ఇప్పటికే జైపూర్ నగరంలో తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటులో 1.80 లక్షల యూనిట్లను తయారు చేసే సామర్ధ్యం గలదు. ఈ కంపెనీ ఇప్పటికే అనేక స్కూటర్లను తయారు చేసింది. ప్రస్తుతం ప్రతిరోజూ 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది.   అలాగే, రాబోయే మూడేళ్లలో భారతీయ మార్కెట్లో కనీసం పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలోని రివోల్ట్ ఆర్‌వి300/400 వంటి ఎలక్ట్రిక్ బైక్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

(చదవండి: ఓలా, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా వచ్చేస్తున్న హీరో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌!)

మరిన్ని వార్తలు