హాస్పిటల్ బెడ్స్‌పై జీఎస్టీ బాదుడు: మరింత నరకం!

18 Jul, 2022 17:05 IST|Sakshi

చివరకు ఆసుపత్రుల్ని కూడా వదలని గబ్బర్‌ సింగ్‌: కాంగ్రెస్‌ సెటైర్లూ

రోజుకు రూ. 5వేలు  మించిన  ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ

సాక్షి, ముంబై:  ‘ఒకే దేశం ఒకే  పన్ను’ అంటూ  కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ ఇపుడికి రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల  బాదుడుకు తోడు  బీజేపీ  సర్కార్‌ మరో భారాన్ని మోపింది. జూన్ చివరలో జరిగిన 47వ సమావేశంలో హాస్పిటల్ బెడ్స్‌పై 5 శాతం జీఎస్‌టీని కౌన్సిల్ సిఫార్సు చేసింది.  దీని కేంద్రం ఆమోదం  తెలిపిన నేపథ్యంలో నేటి(జూలై 18, 2022) రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై అదనపు భారం పడనుంది.

ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్‌పుట్ ట్యా ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ  భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ రోజునుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నులపై కాంగ్రెస్‌ మండిపడింది. చివరికి ఆసుపత్రి పడకలపై కూడా పన్ను బాదుడుపై సోషల్‌ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవస్పత్రి పడకలపై కూడా పన్నుతో గబ్బర్‌ సింగ్‌  మరో బాదుడుకు తెరతీశాడని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కేంద్రం నిర్ణయం దేశ ప్రజలపై పెను భారం మోపుతుందని ట్విటర్‌లో మండిపడింది. అసలే కోవిడ్‌-19 మహమ్మారిసంక్షోభంతో ఆరోగ్య సంరక్షణకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి,  ముఖ్యంగా పేద ప్రజలను మరింత నరకంలో నెట్టేసిందని ట్వీట్‌ చేసింది. కాగా దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  అలాగే ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో సహా అనేక వస్తువులపై జీఎస్టీ వసూలుకు ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వార్తలు