EPFO E Nomination: ఈ-నామినేషన్‌ కంపల్సరీ.. ఇలా 10 నిమిషాల్లో అప్‌డేట్‌ చేసేయండి!

21 Aug, 2022 18:05 IST|Sakshi

మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినీ వివరాలు అప్‌డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు కూడా ఉంటాయి. కనుక ఇప్పుడే ఆలస్యం కాకుండా త్వరగా మీ ఈపీఎఫ్‌ ఈ- నామినేషన్‌ చేయండి.

ఈ నామినేషన్‌ సులభంగా చేసేయండి ఇలా...
►ఈపీఎఫ్‌ఓ( EPFO ) వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ‘సర్వీసెస్‌’ విభాగంలోకి వెళ్లండి.
►‘ఫర్‌ ఎంప్లాయిస్‌’ విభాగంలో ‘మెంబర్ UAN/ఆన్‌లైన్ సర్వీస్’ ఆఫ్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
►మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
►లాగిన్‌ అయ్యాక 'మేనేజ్' ట్యాబ్ కింద, 'ఇ-నామినేషన్' ఎంచుకోండి.
►ఇప్పుడు అందులో మీ 'వివరాలను నింపి' ట్యాబ్ కింద ఉన్న 'సేవ్' క్లిక్ చేయండి.
►తర్వాత మీ కుటుంబ డిక్లరేషన్‌ను అప్‌డేట్ చేసేందకు మీ కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, జెండర్‌,రిలేషన్‌, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు (ఆఫ్షనల్‌),     గార్డియన్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన వివరాలను నింపిన తర్వాత ‘ఎస్‌’పై క్లిక్ చేయండి.

►ఇక ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను వివరాలను నింపే ఆఫ్షన్‌ ఉంటుంది. అక్కడ ఉన్న 'యాడ్‌ ఫ్యామిలీ డీటెయిల్స్‌'పై క్లిక్ చేయండి.
►ఇందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు నింపిన తర్వాత వారి నగదు వాటాను నిర్ణయించుకుని ఆ  మొత్తాన్ని అందులో నింపాలి. ఆపై ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి.
►ఇప్పుడు 'ఈ-సైన్' ఆఫ్షన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని(otp) సబ్మిట్‌ చేయండి.
►అయితే ఈ-నామినేషన్‌ను దాఖలు చేసేందుకు, ఈపీఎఫ్‌ సభ్యలు ముందుగా యూఏఎన్‌( UAN )మెంబర్ పోర్టల్‌లో వారి యూఏఎన్‌ ఖాతాను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి మెంబర్ ఐడీ, ఎస్టాబ్లిష్‌మెంట్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, తండ్రి/భార్య పేరు, సంబంధం, ఉద్యోగంలో చేరిన తేదీని నిర్ధారించుకోవాలి. వీటితో పాటు ప్రతి నామినీకి కేవైసీ( KYC) వివరాలను సమర్పించడంతో పాటు వారి PF/ EDL మొత్తం వాటాను కూడా తెలిపాల్సి ఉంటుంది.

చదవండి: షావోమీ భారీ షాక్‌, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు!

మరిన్ని వార్తలు