ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు మీరు అర్హులేనా? ఇలా అప్లయ్‌ చేసుకోండి!

5 Mar, 2023 09:42 IST|Sakshi

ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్‌ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అధిక పెన్షన్‌ కోసం ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో అప్లయ్‌ చేసుకునే వీలు కల్పించింది.

ఉద్యోగులు పెన్షన్‌ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్‌ పే ప్లస్‌ డియర్‌నెస్‌ అలవెన్స్‌) నెలకు రూ.15,000 ఉండాలి. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్‌(ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం)లో జమ చేయాల్సి ఉంటుంది. 

నవంబర్‌ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్‌ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్‌ఓ రిటైర్డ్‌ ఫండ్‌ బాడీ పోర్టల్‌ను సిద్ధం చేసింది. 

ఈపీఎఫ్‌ఓలో ఎలా అప్లయ్‌ చేయాలి

♦ అర్హులైన ఈపీఎఫ్‌ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్‌(e-Sewa portal)ను సందర్శించాలి

♦అందులో అధిక పెన్షన్‌ అప్లయ్‌ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్‌ పాపప్‌ అవుతుంది. 

♦ ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో అధిక పెన్షన్‌ కోసం (pensionOnHigherWages) అనే ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి. 

♦ అనంతరం అప్లికేషన్‌ ఫారమ్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌తో యూఏఎన్‌ నెంబర్‌, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డ్‌ వివరాల్ని ఎంటర్‌ చేసి ఓటీపీ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి. 

♦ ట్యాప్‌ చేసిన తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్‌ పొందే సౌలభ్యం కలుగుతుంది. లేదంటే రిజెక్ట్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు