WhatsApp Photos And Chats Backup: వాట్సాప్‌ డేటాను ఎలా బ్యాకప్‌ తీసుకోవాలో మీకు తెలుసా!

27 May, 2022 17:48 IST|Sakshi

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వాట్సాప్‌ నుంచి మీకు కావాల్సిన ఫోటోస్‌ని, చాట్స్ సింపుల్‌ టెక్నిక్స్‌తో బ్యాకప్‌ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆ బ్యాకప్‌ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. 

ముందుగా వాట్సాప్‌ చాట్‌ హిస్టరీ, వాయిస్‌ మెసేజ్‌,ఫోటోల్ని,వీడియోల్ని గూగుల్‌ డ్రైవ్‌లోకి ఇంపోర్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్‌ పూర్తయితే రీస్టోర్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. 

వాట్సాప్‌ డేటా బ్యాకప్‌ ఎలా అంటే!

స్టెప్‌1: ముందుగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసి డ్యాష్‌ బోర్డ్‌లో త్రీ డాట్స్‌ మీద క్లిక్‌ చేయాలి. 

స్టెప్‌2: అనంతరం సెట్టింగ్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి

స్టెప్‌3: సెట్టింగ్‌లో చాట్‌ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి

స్టెప్‌4: చాట్‌లో చాట్‌ బ్యాకప్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది

స్టెప్‌5: చాట్‌ బ్యాక్‌ ఆప్షన్‌లో మీకు గూగుల్‌ డ్రైవ్‌ సెట్టింగ్‌ తో పాటు వీడియో ఆప్షన్‌ మీకు కనిపిస్తుంది. 

ఆ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి బ్యాకప్‌ తీసుకోవచ్చు.

దీంతో మీ వాట్సాప్‌ డేటా అంతా మీ మొబైల్‌కు లింకై ఉన్న గూగుల్‌ అకౌంట్‌ డ్రైవ్‌లో స్టోర్‌ అవుతుంది. 

మరిన్ని వార్తలు