సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి?

6 Mar, 2023 11:34 IST|Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)కి సంబంధించి మొద‌టి విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల (Sovereign Gold Bond) ఇష్యూ  సోమవారం(6న) ప్రారంభమైంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్‌) ధర రూ. 5,611ను ఆర్‌బీఐ నిర్ణయించింది. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఈ బాండ్లను చివరి సారిగా గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఆర్‌బీఐ జారీ చేసింది. అప్పుడు గ్రాముకు రూ. 5,409గా ఉంది. ప్రస్తుతం రూ.200 పెరిగింది.  

ఈ సందర్భంగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ గురించి ముఖ్య విషయాలు..

►అధిక ద్రవ్యోల్బణం, రాబోయే గ్లోబల్ మార్కెట్ల అస్థిరత, ఈక్విటీ మార్కెట్ల పనితీరును పరిగణలోకి తీసుకుంటే సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌(sgb)లో 10-15 శాతం పెట్టుబడులు పెట్టడం మంచిదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం  చేస్తున్నారు.
 
►ఎస్‌జీబీ బాండ్స్‌ ఇతర డిజిటల్ ఆస్తుల కంటే భిన్నం. ఎందుకంటే గోల్డ్‌ బాండ్‌ సాయంతో సంవత్సరానికి 2.50 శాతం వడ్డీ రేటును కూడా పొందవచ్చు.

►ఇష్యూ ధరకు జీఎస్టీతో పాటు ఇతర ఛార్జీలు లేనందున బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే అనువైన సమయం

►సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు పని దినాల సగటు ముగింపు ధర ఆధారంగా ఇష్యూ ధర నిర్ణయించబడుతుంది. ఈ రేట్లను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించింది. రేట్లను నిర్ణయించడానికి  999 స్వచ్ఛత బంగారం ధరను పరిగణలోకి తీసుకుంటుంది ఆర్‌బీఐ. 

►డిజిటల్ మోడ్‌లో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ. 50 ధర తగ్గుతుంది. 

►ఈ బాండ్లలో ఏడాదికి గరిష్టంగా 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పరిమితి 1 గ్రాము బంగారం

► బాండ్లు ఎనిమిదేళ్ల కాలపరిమితితో వస్తాయి. ఆకస్మికంగా వైదొలగాల్సి వస్తే పెట్టుబడిదారుడు కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు సంబంధిత బ్యాంక్/పోస్టాఫీసును సంప్రదించాలి. 

►ఎస్‌జీబీలో పెట్టుబడి పెట్టినప్పుడు, హోల్డింగ్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. మీరు దీన్ని డీమ్యాట్ రూపంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తక్కువ లిక్విడిటీ కారణంగా కొన్నిసార్లు ఎక్స్ఛేంజీలలో విక్రయించడం కష్టం.

►ముఖ్యంగా, మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత ఎస్‌జీబీ ఎలాంటి పన్ను విధించదు. అయితే, మీరు దానిని 36 నెలల ముందు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాలుగా పన్ను విధించబడుతుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను ఆర్‌బీఐ పన్ను విధిస్తుంది. 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన బంగారం కోసం, ఇది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణించబడుతుంది. ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం పన్ను విధిస్తుంది. 

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను దొంగిలించినా నష్టం ఉండదు
గోల్డ్‌ ఓ సెంటిమెంట్‌, గోల్డ్‌ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌, గోల్డ్‌ ఒక జ్వువెలరీ, ఒక కమోడిటీ. ఇలాంటి బంగారానికి డిమాండ్‌ తగ్గించేందుకు 2015లో ప్రధాని మోదీ చేతుల మీదిగా  కేంద్రం 3 కొత్త స్కీమ్‌లను ప్రారంభించింది. బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, గోల్డ్‌ కాయిన్స్‌ అమ్మకం,గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.  

పథకం ప్రారంభించే సమయంలో మోదీ మాట్లాడుతూ.. దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారు నిల్వలను ఉపయోగంలోకి తీసుకొని వచ్చేందుకు ఈ కొత్త పథకాల్ని స్టార్ట్‌ చేసినట్లు చెప్పారు. బంగారాన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మానిటైజ్‌ చేసుకునేలా గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌, బాండ్ల రూపంలో బంగారం అమ్మకాలు, అశోక్‌ చక్రం ముద్రతో గోల్డ్‌ కాయిన్స్‌ అమ్మకాలు జరుపుతున్నట్లు ప్రకటించారు.  

అంతేకాదు 20వేల టన్నులున్న బంగారం పేద దేశం ఎలా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసిన మోదీ.. ‘‘బాండ్ల ద్వారా బంగారానికి భద్రత ఉంటుంది. ఇంట్లో బంగారాన్ని దాచుకోవాలంటే భయంగా ఉంటుంది. బాండ్లను ఎవరైనా దొంగిలించినా నష్టం ఉండదని ’’ ప్రధాని మోదీ స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు