ఫోన్‌లో నెట్‌వర్క్‌ లేకున్నా.. ఎమర్జెన్సీ కాల్‌ ఎలా కనెక్ట్‌ అవుతుందో తెలుసా?

25 May, 2023 09:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత జనరేషన్‌లో ఫోన్‌ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, ఫోనులో నెట్‌వ‌ర్క్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఎమ‌ర్జెన్సీ కాల్ చేసే ఆప్ష‌న్ క‌నిపించ‌డాన్ని మనం చాలాసార్లు గ‌మ‌నించే ఉంటాం. ఎవ‌రైనాస‌రే ఎటువంటి నెట్‌వ‌ర్క్ అవ‌స‌రం లేకుండా ఎమ‌ర్జెన్సీ నంబ‌ర్ల‌కు కాల్ చేయ‌వ‌చ్చు. ఎమ‌ర్జెన్సీ కాల్‌లో పోలీసుల‌కు, అంబులెన్స్ మొద‌లైన‌వాటికి ఫోను చేసుకునే అవకాశం ఉంటుంది. 

అయితే, నెట్‌వ‌ర్క్ లేకుండా ఫోన్‌ ఎలా ప‌నిచేస్తుంద‌ని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫోనులో నెట్‌వ‌ర్క్ లేదంటే దాని అర్థం ఆప‌రేట‌ర్ నుంచి నెట్ వ‌ర్క్ అంద‌డం లేద‌ని అర్థం. ఇటువంటి స్థితిలో ఎమ‌ర్జెన్సీ కాల్ మ‌రో  ప‌ద్ధ‌తిలో క‌నెక్ట్ అవుతుంది. మీ ఫోనుకు మీ ఆప‌రేట‌ర్ నుంచి నెట్‌వ‌ర్క్ క‌నెక్ట్ కాక‌పోతే.. ఆటోమేటిక్‌గా  అదే ఏరియాలో అందుబాటులో ఉన్న మ‌రో మొబైల్ నెట్‌వ‌ర్క్ నుంచి కాల్ క‌నెక్ట్ అయ్యే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. ఇటువంటి స్థితిలో ఎమ‌ర్జెన్సీ కాల్ ఏదైనా ఇతర నెట్‌వ‌ర్క్ ద్వారా క‌నెక్ట్ అవుతుంది. ఇటువంటి స‌మ‌యంలో సాధార‌ణ కాల్ క‌నెక్ట్ అవదు. కేవ‌లం ఎమ‌ర్జెన్సీ కాల్స్‌ మాత్ర‌మే క‌నెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎమ‌ర్జెన్సీ కాల్ చేసినా ఏ నెట్ వ‌ర్క్‌తో అయినా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం క‌లుగుతుంది. కాగా, ఎమర్జెన్సీ కాల్స్‌ చేసే సమయంలో ప్ర‌త్యేక‌మైన నెట్‌వ‌ర్క్ ఉండాల‌న్న నియ‌మం ఏదీ లేదు. ఈ కార‌ణంగానే ఎమ‌ర్జెన్సీ కాల్ ఎప్పుడైనా చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. 

కాల్ ఎలా క‌నెక్ట్ అవుతుందంటే..
సాధార‌ణంగా ఎవ‌రైనా ఫోన్  చేసిన‌ప్పుడు ముందుగా ఆ ఫోను మాధ్య‌మం ద్వారా స‌మీపంలోని నెట్‌వ‌ర్క్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ట‌వ‌ర్‌కు మెసేజ్ చేరుకుంటుంది. అప్పుడు ఫోనుకు కాల్ క‌నెక్ట్ అవుతుంది. ఈ ప్ర‌క్రియ కొద్ది సెకెన్ల వ్య‌వ‌ధిలోనే జ‌రుగుతుంది. ఫ‌లితంగానే మీరు వెంట‌నే అవ‌త‌లి వ్య‌క్తితో మాట్లాడ‌గలుగుతారు. 

ఇది కూడా చదవండి: జియో, ఎయిర్‌టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా

మరిన్ని వార్తలు