Aadhar Card: చిరునామాని ఆన్‌లైన్‌లో సవరించండి ఇలా!

18 Jun, 2021 20:50 IST|Sakshi

మీరు కొత్త ఇంటికి మారరా? ఆధార్ కార్డు ఇంకా చిరునామాని చేంజ్ చేయలేదా? అయితే, ఇప్పుడు సులభంగానే ఇంట్లో నుంచే ఆధార్ కార్డులో చిరునామాని మార్చవచ్చు. ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆధార్ యూజర్ కొన్ని వివరాలను అప్ డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డుదారులు స్వీయ సేవా పోర్టల్ ద్వారా చిరునామాను అప్ డేట్ చేయవచ్చు అని ఆధార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "మీరు ఇప్పుడు చిరునామాని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు" అని ట్వీట్ లో పేర్కొంది. 

ఈ సేవను ఉపయోగించుకోవాలంటే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరును కలిగి ఉండాలని ఆధార్ యూజర్ గమనించాలి. అలాగే, ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేసినందుకు రూ.50 చార్జి చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ ఆన్ లైన్ పోర్టల్ చిరునామాను అప్ డేట్ చేయడం కొరకు యుఐడీఎఐ వెబ్ సైట్ లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ ల కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్‌కార్డులో చిరునామాని ఇలా సవరించండి:

  • ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి.
  • అందులో ఫ్రోసిడ్‌ టూ ఆప్‌డేట్‌ ఆధార్‌ను క్లిక్‌ చేయాలి.
  • ఆప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ను క్లిక్‌ చేసిన తరువాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. 
  • తరువాత సెండ్‌ ఓటీపీ మీద క్లిక్‌ చేయాలి. ఆధార్‌తో లింక్‌ ఐనా ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్‌ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. 
  • ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆప్షన్ ఎంచుకొని మీ కొత్త చిరునామా వివరాలు సమర్పించాలి.
  • పీపీఎ డాక్యుమెంట్ ల మీ ఒరిజినల్ కలర్ స్కాన్ డ్ కాపీలను అప్ లోడ్ చేయండి.
  • నమోదు చేసిన డేటాను ఇంగ్లిష్, స్థానిక భాషలో కనిపిస్తుంది. 
  • ఇప్పుడు అభ్యర్థనను సబ్మిట్ చేయండి. మీ ఆధార్ అప్ డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం కొరకు మీరు మీ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబరు(ఆర్ ఎన్ ఆర్ ఎన్)ని సేవ్ చేసుకోవాలి.

చదవండి:  పీఎఫ్ యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేసుకోండి ఇలా..?

మరిన్ని వార్తలు