ఎమ్‌ఆర్‌పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి - చాలా సింపుల్ కూడా!

28 Mar, 2023 10:30 IST|Sakshi

మనం నిత్యజీవితంలో ప్రతి రోజూ బస్ స్టేష‌న్స్‌లో, రైల్వే స్టేషన్స్ వద్ద లేదా ఇతర ప్రాంతాలలో MRP ధరలకే అన్ని అందుబాటులో ఉంటాయనే బోర్డులు చూస్తూనే ఉంటాము. అయితే దుకాణదారుడు నిర్దేశించిన ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మీరు లీగల్ మెట్రాలజీ విభాగానికి కంప్లైంట్ చేయవచ్చు.

భారతదేశంలో ఒక దుకాణదారుడు రిటైల్ ప్రైస్ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే అది చట్టవిరుద్ధం, దీనిపైన బాధితుడు కంప్లైట్ చేస్తే తప్పకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం.. ఉత్పత్తి మీద లేదా వస్తువు మీద ముద్రించిన ధరకే విక్రయాలు జరపాలి.

(ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి: బంగారం నుంచి మొబైల్స్ వరకు!)

నిజానికి ఒక వస్తువు రిటైల్ ప్రైస్ అనేది కొనుగోలు చేయడానికి కస్టమర్‌కు ఛార్జ్ చేసిన ధర. ఇందులో అన్ని పన్నులు, ఉత్పత్తి ఖర్చు, రవాణా, తయారీదారుకు అయ్యే ఖర్చు వంటివి లెక్కించి నిర్దారిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారుని స్పష్టత కోసం ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేస్తారు.

ఎమ్‌ఆర్‌పి కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎలా కంప్లైంట్ చేయాలి?

  • దుకాణదారుడు మీకు నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించాడని తెలిసినప్పుడు లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. 
  • నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000/ 1915కి కాల్ చేయవచ్చు, లేదా మీ జిల్లాలోని కన్జ్యుమర్ ఫోరమ్‌లో కంప్లైంట్ చేయవచ్చు.
  • బాధితుడు 8800001915కు SMS పంపవచ్చు లేదా NCH యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
  • కాల్, ఎస్ఎమ్ఎస్ వద్దనుకున్నప్పుడు https://consumerhelpline.gov.in/user/signup.php ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీనికి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. 
  • మీరు కంప్లైంట్ చేయడానికి పైన అన్ని మార్గాలను అనుసరించినప్పటికీ సమాధానం రానప్పుడు NCDRC వెబ్‌సైట్, స్టేట్ కమిషన్, డిస్ట్రిక్ట్ కమిషన్ వంటి వినియోగదారు కమిషన్‌ను సంప్రదించవచ్చు.
  • విచారణ తరువాత కూడా దుకాణదారుడు మళ్ళీ అలాంటి ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా బాధితుడు కూడా భారీ మొత్తంలో నష్టపరిహారం పొందవచ్చు.
మరిన్ని వార్తలు